బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

అభినయ్ దర్శన్ వ్యవహారంపై విచారణ.. హోం మంత్రి అనిత వ్యాఖ్యలు

అభినయ్ దర్శన్ వ్యవహారంపై విచారణ.. హోం మంత్రి అనిత వ్యాఖ్యలు

మే 22, (నేటి తెలుగు పత్రిక): క్రైస్తవ మత ప్రచారకుడు, నటుడు అభినయ్ దర్శన్‌కు సంబంధించిన వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఈ కేసులో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన మంత్రి అనిత.. ఈ ఘటనలో రాజకీయ కోణం ఉందా అనే అంశంపై కూడా విచారణ జరుగుతోందన్నారు. కడప నుంచి అల్లూరి జిల్లాకు రావాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. గిరిజనులను ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందనే అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు.అభినయ్ దర్శన్‌పై ఇప్పటికే కొన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయని, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయని హోం మంత్రి తెలిపారు. ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలు చేసే ప్రయత్నం జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారని చెప్పారు.ఈ కేసులో నిజానిజాలు త్వరలో బయటపడతాయని, అవసరమైతే అభినయ్ దర్శన్‌ను కస్టడీలోకి తీసుకుని విచారణ చేపడతామని మంత్రి అనిత వెల్లడించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ప్రభుత్వం సహించదని హెచ్చరించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్