Breaking News

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జేఎస్‌సీ క్యాలెండర్ విడుదల

మే 22, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ (జేఎస్‌సీ) సమావేశాల క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఉద్యోగుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ఈ సమావేశాలను క్రమబద్ధంగా నిర్వహించనున్నట్లు తెలిపింది.సాధారణ పరిపాలన శాఖ విడుదల చేసిన జీవో ఆర్‌టీఈ నంబర్ 1032 ప్రకారం, జిల్లా స్థాయి జేఎస్‌సీ సమావేశాలు జూన్, అక్టోబర్, ఫిబ్రవరి నెలల్లో నిర్వహించనున్నారు. అదే నెలల్లో హెచ్‌వోడీ స్థాయి సమావేశాలు కూడా జరగనున్నాయి.అదేవిధంగా సచివాలయంలోని వివిధ శాఖలకు సంబంధించిన జేఎస్‌సీ సమావేశాలు జులై, నవంబర్, మార్చి నెలల్లో నిర్వహిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఉద్యోగ సంఘాలు లేవనెత్తే సమస్యల పరిష్కారానికి ఈ సమావేశాలు వేదికగా నిలుస్తాయని స్పష్టం చేసింది.సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సమావేశాల మినిట్స్, యాక్షన్ టేకెన్ రిపోర్టులను ఉన్నతాధికారులకు పంపించాలని ప్రభుత్వం సూచించింది. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సమావేశాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లు, విభాగాధిపతులకు స్పష్టం చేసింది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *