బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

అన్యాయాలు చేసిన వారిపై చర్యలు తప్పవు

అన్యాయాలు చేసిన వారిపై చర్యలు తప్పవు

"Trust is important in politics" – Jagan YS Jaganmohan Reddy Jagan

కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు

నెల్లూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బుధవారం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, “కేవలం ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. తాము ఇంతవరకు కార్యకర్తల విషయంలో ఒక విధంగా ఉన్నాం, ఇకపై కొత్త విధానంతో ముందుకు వెళ్తాం” అని వెల్లడించారు.

“అన్యాయాలు చేసిన వారిపై చర్యలు తప్పవు”
తమ కార్యకర్తలపై అన్యాయాలు చేసిన వారి పేర్లు గుర్తుపెట్టుకుని, వారిని చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించిన జగన్, అక్రమ కేసుల పేరిట తమ కార్యకర్తలను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

“జెండా మోసిన ప్రతి కార్యకర్తకు భరోసా”
వైసీపీ కార్యకర్తలకు పూర్తి అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చారు. జెండా మోసిన ప్రతి కార్యకర్తకు తాము నిస్సందేహంగా భరోసా కల్పిస్తామని ధైర్యం చెప్పారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

“కూటమి హామీలు గాలికొదిలేశాయి”
టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా గాలికొదిలేశారని, వైసీపీ ప్రభుత్వం అందించిన పథకాలను రద్దు చేస్తూ ప్రజలకు అన్యాయం చేశారని జగన్ మండిపడ్డారు.

“ప్రజలతో నమ్మకంగా ఉండాలి”
రాజకీయాల్లో వ్యక్తిత్వం, విశ్వసనీయత ముఖ్యమని, ఒక నాయకుడు మాట ఇచ్చినప్పుడు ప్రజలు దాన్ని నమ్ముతారని, ఆ మాట నిలబెట్టడం ముఖ్యమని జగన్ హితవు పలికారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వైసీపీ మేనిఫెస్టోను అమలు చేశామని పేర్కొన్నారు.

జిల్లాల పర్యటనల ప్రణాళిక
జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరిలో నుంచి జిల్లాల పర్యటనలు ప్రారంభిస్తానని జగన్ ప్రకటించారు. “ప్రజల కోసం, వారి ప్రయోజనాల కోసం మనం మరింత సమర్థంగా పని చేయాలి. నాయకులందరూ యాక్టివ్‌గా ఉండాలి” అని ఆయన పిలుపునిచ్చారు.