“ఇదొక చిన్న విషయం.. 2001లోని ఇబ్బందులతో పోలిస్తే ఇది ఏమాత్రం కాదు” – కేటీఆర్
తెలంగాణ భవన్‌లో జరిగిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నేతలతో పాటు రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, 2001లో కేసీఆర్ పార్టీ స్థాపన సమయంలో ఎదురైన సమస్యలతో పోలిస్తే, ప్రస్తుత పరిస్థితి చాలా చిన్నదని వ్యాఖ్యానించారు.
కేసులపై ధైర్యం “ఇది ఓ లొట్టపీసు కేసు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. వాడు లొట్టపీసు ముఖ్యమంత్రి, పీకేది ఏమి లేదు. కేసీఆర్ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డగా చెబుతున్నా, ఈ కేసు నాకు అసలు ఇబ్బంది కాదు. మా లీగల్ టీమ్ బలంగా ఉంది. ఈ కేసు గురించి మేము సరైన విధంగా ఎదుర్కొంటాం. టెన్షన్ తీసుకోకండి,” అని కేటీఆర్ స్పష్టం చేశారు.
త్రీడి పాలన పై విమర్శలు
“ఇక్కడ త్రీడి పాలన నడుస్తోంది. డైవర్షన్, డిస్ట్రాక్షన్, డిమోలిషన్ – ఇవే ఇప్పుడు జరుగుతున్నాయి. నిన్న కాంగ్రెస్ ప్రతినిధి తెలంగాణలో 90 లక్షల మందికి రూ. 2500 ఇస్తున్నామని అన్నారు. ఇంత అబద్ధాలు చెప్పడం చూస్తుంటే నవ్వొస్తుంది,” అంటూ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
రైతుల సమస్యలపై సమర శంఖం కేటీఆర్ మాట్లాడుతూ, “రైతుల రుణమాఫీ ఇంకా పూర్తిగా అందరికీ చేరలేదు. ఈ సమస్యలపై మేము కొట్లాడతాం. అవసరమైతే సుప్రీం కోర్టు వరకు వెళ్తాం. తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం అందరం కలిసి పనిచేయాలి,” అని పిలుపునిచ్చారు.
కార్యకర్తల శిక్షణ, కమిటీల ఏర్పాటు
తెలంగాణ అభివృద్ధి కోసం గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేస్తామని, కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. “హైదరాబాద్ అభివృద్ధి కోసం మేము చేసిన కృషిని ఎవరూ కాదనలేరు. మనమంతా కలిసి తెలంగాణ ప్రయోజనాల కోసం ముందుకు సాగాలి,” అని కేటీఆర్ ధైర్యం నింపారు.