కరీంనగర్, నల్గొండ టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు
తెలంగాణలో టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక వేగవంతమైంది. కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ (Karimnagar Teacher MLC) స్థానానికి బీజేపీ (BJP) నుంచి మల్క కొమురయ్య (Malka Komaraiah), పీఆర్టీయూ (PRTU) నుంచి వంగ మహేందర్ రెడ్డి (Vanga Mahender Reddy), యూటీఎఫ్-టీపీటీఎఫ్ (UTF-TPTF) సంయుక్త అభ్యర్థిగా అశోక్ కుమార్ (Ashok Kumar) పేర్లు ఖరారైనట్లు సమాచారం.
నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు
నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పీఆర్టీయూ (PRTU) నుంచి శ్రీపాల్ రెడ్డి (Sripal Reddy), యూటీఎఫ్ (UTF) నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ ఏ.నర్సిరెడ్డి (A. Narsireddy), బీజేపీ (BJP) నుంచి పీఆర్టీయూ మాజీ అధ్యక్షుడు సర్వోత్తం రెడ్డి (Sarvottham Reddy), మాజీ ఎమ్మెల్సీ పులా రవీందర్ (Pula Ravinder), వరంగల్‌కు చెందిన వెంకటస్వామి (Venkata Swamy), సుందర్ రాజు పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.
కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ హాట్‌టాపిక్
కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ (Graduate MLC) స్థానానికి బీఆర్ఎస్ (BRS) పార్టీ నుంచి రవీందర్ సింగ్ అభ్యర్థిగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) తాజా వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. “ఇవాళ లేదా రేపటికి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటిస్తాం. ఆలస్యమైనా తప్పక గెలుస్తాం. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం” అని ధీమా వ్యక్తం చేశారు.
టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. అన్ని పార్టీలు గట్టి పోటీకి సన్నద్ధమవుతున్నాయి.
