మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఘన నివాళులు
మహాత్మా గాంధీ (Mahatma Gandhi) వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ (Governor Jishnu Dev Varma), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) లంగర్ హౌస్‌లోని బాపూఘాట్ వద్ద గాంధీకి అంజలి ఘటించారు.
తెలంగాణ నేతల నివాళి
ఈ సందర్భంగా దేశ స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీఎస్ శాంతి కుమారి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీలో రాజ్ ఘాట్ వద్ద ఘన నివాళి
ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు మహాత్మా గాంధీ సమాధికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ, “దేశాభివృద్ధికి బాపూజీ ఆశయాలు, ఆదర్శాలు ఎప్పటికీ మార్గదర్శకంగా ఉంటాయి” అన్నారు.
