Breaking News

For the first time, a huge budget of ₹50 lakh crore!

తొలిసారి ₹50 లక్షల కోట్ల భారీ బడ్జెట్!

ఎన్డీయే మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తొలి పూర్తి స్థాయి బడ్జెట్

న్యూఢిల్లీ: కేంద్రంలో ఎన్డీయే మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తన 8వ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో కీలక రంగాలకు భారీ కేటాయింపులు చేశారు.

బడ్జెట్ కేటాయింపులు – ముఖ్యమైన రంగాలు:

రక్షణ శాఖ: ₹4,91,732 కోట్లు
గ్రామీణాభివృద్ధి: ₹2,66,817 కోట్లు
హోం శాఖ: ₹2,33,211 కోట్లు
వ్యవసాయం & అనుబంధ రంగాలు: ₹1,71,437 కోట్లు
ఆరోగ్య శాఖ: ₹98,311 కోట్లు
పట్టణాభివృద్ధి: ₹96,777 కోట్లు
ఐటీ & టెలికాం: ₹95,298 కోట్లు
విద్యుత్: ₹81,174 కోట్లు
వాణిజ్యం & పరిశ్రమలు: ₹65,553 కోట్లు
సామాజిక సంక్షేమం: ₹60,052 కోట్లు


బడ్జెట్ హైలైట్స్:

🔹 పన్నుల పరంగా:

Reconstruction of the state is our goal: CM Chandrababu
రాష్ట్ర పునర్నిర్మాణం మా లక్ష్యం: సీఎం చంద్రబాబు
  • కొత్త పన్ను విధానంలో ₹12 లక్షల వరకు ఆదాయంపై ట్యాక్స్ మినహాయింపు.
  • వృద్ధులకు వడ్డీపై TCS మినహాయింపు.
  • వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను (Income Tax) బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం ప్రకటింపు.

🔹 వ్యవసాయం & గ్రామీణాభివృద్ధి:

  • కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి ₹3 లక్షల నుంచి ₹5 లక్షలకు పెంపు.

🔹 ఆరోగ్య & ఔషధ రంగం:

  • 36 కీలక ఔషధాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగింపు.
  • గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా కల్పన.

🔹 బీమా & పెట్టుబడులు:

Telangana is the only state where farmer suicides have decreased
రైతు ఆత్మహత్యలు తగ్గిన ఏకైక రాష్ట్రం తెలంగాణ
  • బీమా రంగంలో ఎఫ్‌డీఐ (Foreign Direct Investment) పరిమితిని 100%కి పెంపు.

తొలిసారి ₹50 లక్షల కోట్ల భారీ బడ్జెట్!

  • మొత్తం బడ్జెట్ వ్యయం: ₹50,65,345 కోట్లు
  • రెవెన్యూ వసూళ్లు: ₹34,20,409 కోట్లు
  • మూలధన వసూళ్లు: ₹16,44,936 కోట్లు
  • అప్పులు & ఇతర వసూళ్లు: రూ.28.37 లక్షల కోట్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *