బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని గుండెలకు హత్తుకున్న మోదీ

ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని గుండెలకు హత్తుకున్న మోదీ

ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని గుండెలకు హత్తుకున్న మోదీ – మందకృష్ణ మాదిగ

హైదరాబాద్: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ నిండు అసెంబ్లీలో ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని అణచివేస్తానని అవమానిస్తే, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి 40 నిమిషాల ప్రసంగంలో ఎమ్మార్పీఎస్ పేరు కూడా ప్రస్తావించకుండా అవమానించారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ తీవ్ర విమర్శలు చేశారు.

శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ 2025 డైరీ, క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ:

  • సమాజంలో అట్టడుగు వర్గం నుంచి వచ్చిన తమ ఉద్యమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తించి గుండెలకు హత్తుకున్నారని,
  • తన 30 ఏళ్ల ఉద్యమ పోరాటంలో జర్నలిస్ట్ యూనియన్ తనతో కలిసి నడిచిందని అన్నారు.
  • ఎమ్మార్పీఎస్ ఉద్యమం జాతి కోసం కష్టపడిన చరిత్ర కలిగి ఉందని, ఉద్యమానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ తాను రుణపడి ఉంటానని అన్నారు.

కార్యక్రమంలో ప్రముఖుల హాజరు

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బి. వెంకటేష్ నేత, యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాదరావు, బీజేపీ దళిత మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్. కుమార్, ఇతర సంఘాల నాయకులు సాయి కృష్ణ, సుధాకర్ గండే, పిట్ట శ్రీనివాస్ రెడ్డి, పెద్దాపురం నరసింహ, యూనియన్ ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, దాసన్న తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ

ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి సరైన గుర్తింపు రావాలని, దళితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని మందకృష్ణ మాదిగ తెలిపారు.