Breaking News

Rahul Gandhi is the reason for BJP's victory in Delhi

ఢిల్లీలో బీజేపీ గెలుపుకు కారణం రాహుల్ గాంధీ

ఢిల్లీలో బీజేపీ గెలుపుకు కారణం రాహుల్ గాంధీ – కేటీఆర్ సెటైర్ ట్వీట్

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ భారీ ఆధిక్యంలో ఉండటంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సెటైర్ వేశారు. “ఢిల్లీలో బీజేపీని గెలిపిస్తున్న రాహుల్ గాంధీకి కంగ్రాట్స్” అంటూ ఎక్స్ (Twitter) వేదికగా చురకలు అంటించారు.

నీట్ పరీక్ష నిర్వహణలో వైఫల్యం: సిపిఐ తీవ్ర విమర్శలు

ఆప్‌పై కట్టప్ప పాత్ర పోషించిన కాంగ్రెస్ – బీఆర్‌ఎస్ విమర్శలు

  • బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యక్షంగా మద్దతుగా నిలిచిందని, ఆప్ ఓటింగ్ శాతం దెబ్బతీసిందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు.
  • 10కి పైగా నియోజకవర్గాల్లో బీజేపీ, ఆప్ మధ్య కేవలం వెయ్యి ఓట్ల తేడా మాత్రమే ఉందని పేర్కొన్నారు.
  • 100 ఓట్ల తేడాతోనూ బీజేపీ అభ్యర్థులు విజయం సాధిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.

27 ఏళ్ల తరువాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి

  • దేశ రాజధానిలో బీజేపీ 27 ఏళ్ల తరువాత అధికార పీఠాన్ని దక్కించుకునే దిశగా దూసుకెళ్తోంది.
  • ఇప్పటికే మేజిక్ ఫిగర్ 36 సీట్లను దాటి 43 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
  • ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అసలైన నష్టం ఆప్‌కి చేసిందని, ప్రత్యక్షంగా బీజేపీకి లబ్ధి కలిగించిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అక్రమాల ఆరోపణలతో నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *