Breaking News

BJP aggressive in Delhi assembly results

దిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో భాజపా దూకుడు. వెనుకంజలో ఆప్ నేతలు..

దిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో భాజపా దూకుడు – వెనుకంజలో ఆప్ నేతలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాల సరళి కనిపిస్తోంది. భాజపా మేజిక్ ఫిగర్ దాటి అధికారాన్ని దిశగా దూసుకెళ్తుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) వెనుకబడుతోంది.

నీట్ పరీక్ష నిర్వహణలో వైఫల్యం: సిపిఐ తీవ్ర విమర్శలు

తాజా ట్రెండ్ ప్రకారం:

  • భాజపా – 43 స్థానాల్లో ముందంజ
  • ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) – 27 స్థానాల్లో ఆధిక్యంలో
  • కాంగ్రెస్ (INC) – ఖాతా తెరవలేకపోయింది

ప్రముఖ నేతల పోటీ పరిస్థితి

  • న్యూఢిల్లీలో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో, భాజపా అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ స్వల్ప ఆధిక్యంలో
  • కాల్కాజీ అసెంబ్లీ స్థానం – దిల్లీ ఉపముఖ్యమంత్రి ఆతిశీ వెనుకంజ
  • జంగపురలోఆప్ నేత మనీష్ సిసోదియా ముందంజలో
  • షాకుర్ బస్తీఆప్ అభ్యర్థి సత్యేంద్ర కుమార్ జైన్ వెనుకంజ
  • ఓక్లాఆప్ అభ్యర్థి అమానుతుల్లా ఖాన్ ముందంజలో
  • గాంధీనగర్ – భాజపా అభ్యర్థి అర్విందర్ సింగ్ లవ్లీ ముందంజ
  • బద్దీ – కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్ర యాదవ్ వెనుకంజ
  • బిజ్వాసన్ – భాజపా అభ్యర్థి కైలాష్ గహ్లోత్ ముందంజ
  • గ్రేటర్ కైలాష్ – ఆప్ అభ్యర్థి సౌరభ్ భరద్వాజ్ వెనుకంజ

ఈ ఫలితాల దిశ చూస్తే భాజపా దిల్లీ సింహాసనాన్ని చేజిక్కించుకునే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పూర్తి స్థాయిలో నిష్క్రియంగా మారినట్లు స్పష్టంగా వెల్లడవుతోంది. ఆప్ అధికారం నిలుపుకోవడం కష్టసాధ్యమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అక్రమాల ఆరోపణలతో నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *