బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

మున్సిపల్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

మున్సిపల్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, నేటి తెలుగు పత్రిక: జిల్లాలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, చొప్పదండి, జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపాలిటీలకు బుధవారం నిర్వహించనున్న ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు.2వ మున్సిపల్ సాధారణ ఎన్నికలు-2026లో భాగంగా కరీంనగర్ జిల్లాలో పోలింగ్ జరగనున్న కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, చొప్పదండి మున్సిపాలిటీకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను చొప్పదండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేశారు.ఈ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం సందర్శించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లోని ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్న ఎన్నికల సిబ్బందితో మాట్లాడారు. ఎన్నికల సామాగ్రిని చెక్ లిస్ట్ ప్రకారం క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే రూట్, మానిటరింగ్ అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను పాటిస్తూ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల సామాగ్రితో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లోనే పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని, అధికారులు సూచించిన చోటే బస చేయాలని ఆదేశించారు.చొప్పదండిలో పోలింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఓటర్లు స్వేచ్ఛగా ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు