Breaking News

ఏపీ 2026–27 బడ్జెట్.. శాఖల వారీగా భారీ కేటాయింపులు.

నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అభివృద్ధి–సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ రూపొందించిన బడ్జెట్ అని ఆయన పేర్కొన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ముందుచూపుతో రాష్ట్రం వృద్ధి దిశగా పయనిస్తోందని తెలిపారు.

2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్రధాన శాఖలు, పథకాల వారీగా కేటాయింపులు ఇలా ఉన్నాయి:

ఏపీలో సూపర్ న్యూస్.. మహాశివరాత్రి సందర్భంగా సోమవారం ఆప్షనల్ హాలీడే.

🔹 ప్రధాన శాఖల కేటాయింపులు

  • పాఠశాల విద్య – రూ. 32,308.32 కోట్లు
  • బీసీ సంక్షేమం – రూ. 23,650.88 కోట్లు
  • గ్రామీణాభివృద్ధి (PR&RD) – రూ. 22,941.54 కోట్లు
  • ఆరోగ్యం – రూ. 19,306.04 కోట్లు
  • జల వనరులు – రూ. 18,223.67 కోట్లు
  • పురపాలక శాఖ (MAUD) – రూ. 14,538.68 కోట్లు
  • ఇంధనం (Energy) – రూ. 13,934.25 కోట్లు
  • వ్యవసాయం – రూ. 11,745.21 కోట్లు
  • సామాజిక సంక్షేమం – రూ. 11,118.84 కోట్లు
  • EWS సంక్షేమం – రూ. 10,699.33 కోట్లు

🔹 విద్యా రంగం ప్రత్యేక పథకాలు

  • తల్లికి వందనం – రూ. 9,668 కోట్లు
  • మహిళా & శిశు సంక్షేమం – రూ. 4,581 కోట్లు
  • స్కాలర్‌షిప్స్ (RTF & MTF) – రూ. 3,836 కోట్లు
  • సమగ్ర శిక్ష – రూ. 2,946 కోట్లు
  • ఉన్నత విద్య – రూ. 2,566 కోట్లు
  • డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం – రూ. 2,161 కోట్లు
  • మన బడి మన భవిష్యత్తు (క్యాపిటల్ వర్క్స్) – రూ. 1,500 కోట్లు
  • నైపుణ్యాభివృద్ధి – రూ. 1,232 కోట్లు
  • PM స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా – రూ. 707 కోట్లు
  • సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర – రూ. 654 కోట్లు
  • యువత అభివృద్ధి & సేవలు – రూ. 438 కోట్లు

🔹 వ్యవసాయ & సాగునీటి రంగం

  • వ్యవసాయం & ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు (పోలవరం మినహా) – రూ. 9,906 కోట్లు
  • అన్నదాత సుఖీభవ – రూ. 6,600 కోట్లు
  • పోలవరం ప్రాజెక్ట్ – రూ. 6,105 కోట్లు
  • రాష్ట్రీయ కృషి వికాస్ యోజన – రూ. 1,927 కోట్లు
  • ధర స్థిరీకరణ నిధి – రూ. 500 కోట్లు
  • మత్స్యకార సేవలో – రూ. 260 కోట్లు
  • పంట బీమా – రూ. 250 కోట్లు
  • PM కృషి సించాయి యోజన – రూ. 190 కోట్లు

🔹 సంక్షేమ పథకాల కేటాయింపులు

  • ఎన్టీఆర్ భరోసా – రూ. 27,719 కోట్లు
  • దీపం 2.0 – రూ. 2,601 కోట్లు
  • వివిధ వర్గాలకు ఆర్థిక మద్దతు – రూ. 2,320 కోట్లు
  • స్త్రీశక్తి – రూ. 1,420 కోట్లు
  • వీకర్ సెక్షన్లకు సబ్సిడీ, ఉచిత విద్యుత్ – రూ. 600 కోట్లు
  • ఆటో డ్రైవర్ల సేవలో – రూ. 450 కోట్లు
  • స్త్రీ, శిశు సంక్షేమం – రూ. 4,581 కోట్లు

మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకారం, ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు సమతుల అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ రూపొందించామని తెలిపారు. రాష్ట్రం 11.75% వృద్ధి రేటు నమోదు చేసిందని, 2026–27లో కూడా రెండంకెల వృద్ధి సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత్ ఎక్కువగా ఏ దేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకుంటుంది? టాప్ 5 లిస్ట్ ఇదే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *