Breaking News

బుడ్డ శనిగ కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి.

యూరియా కొరత లేకుండా చూడాలి.

పెంచిన రసాయనిక ఎరువుల ధరలు తగ్గించాలిమాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ తులసి రెడ్డి.

విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ.

పులివెందుల ఫిబ్రవరి 17 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): బుడ్డ శనిగ కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని, యూరియా కొరత లేకుండా చూడాలని, పెంచిన రసాయనిక ఎరువుల ధరలు వెంటనే తగ్గించాలని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గం, వేంపల్లి మండలం చింతల మడుగు పల్లి గ్రామంలో నాగులయ్య, ఈశ్వరమ్మ రైతు దంపతుల బుడ్డ శనిగ పంట పొలాన్ని కాంగ్రెస్ నాయకులతో కలిసి తులసి రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా నాగులయ్య,ఈశ్వరమ్మ దంపతులు తమ గోడును తులసి రెడ్డి వద్ద వెల్లబోసుకున్నారు. తులసి రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ, ప్రకాశం జిల్లాలలో రబీ సీజన్లో బుడ్డ శనిగ ప్రధానమైన పంటని, దాదాపు 12 లక్షల ఎకరాలలో ఈ పంట వేస్తారని అన్నారు.

ఈ సంవత్సరం బుడ్డ శనిగ దిగుబడి బాగా వచ్చినప్పటికీ ధర లేని కారణంగా రైతులు లబోదిబో అంటున్నారని తులసి రెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాలు బుడ్డ సెనగకు రు 5875 గా కనీస మద్దతు ధరను ప్రకటించింది.కానీ మార్కెట్లో ఆ ధర లభించడం లేదు.వ్యాపారస్తులు క్వింటాలు బుడ్డ సెనగను రు 4800 కు మాత్రమే రైతుల వద్ద కొంటున్నారు..దీనికి తోడు క్వింటాలుకు ఐదు కేజీలు తరుగు తీస్తున్నారు. దీని వలన క్వింటాలు మీద రైతులు 1000 రూపాయల వరకు నష్టపోతున్నారు.ఈ పరిస్థితుల్లో ప్రభుత్వము బుడ్డ శనిగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే 50 శాతం పంటను రైతులు అయిన కాడికి అమ్ముకున్నారు. ఇప్పుడైనా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని తులసి రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రాచవీడు వీరభద్రుడు.

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుని తో ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం వరి, జొన్న, మొక్కజొన్న, అరటి, నువ్వు తదితర పంటలకు యూరియా అవసరం ఎంతైనా ఉంది.కానీ రాష్ట్రవ్యాప్తంగా యూరియా కొరత తీవ్రంగా ఉంది. యూరియా బస్తా ధర 266 రూపాయలు కాగా బ్లాక్ మార్కెట్లో బస్తా యూరియా మీద 300 రూపాయల నుంచి 600 రూపాయల వరకు ఎక్కువ చెల్లించి కొనాల్సి వస్తోంది. ఒకవైపు వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు లబోదిబోమంటుంటే కేంద్ర ప్రభుత్వం రసాయన ఎరువుల ధరలు విపరీతంగా పెంచడం శోచనీయం. ఆరు నెలల్లోనే రెండుసార్లు ప్రభుత్వం ధరలు పెంచింది. మ్యూరెట్ ఆఫ్ పొటాషియం ధర ఆరు నెలల కిందట 50 కేజీల బస్తా 1400 రూపాయలు ఉండగా ప్రస్తుతం 1850 రూపాయలు అయింది. 14-35-14 ధర 50 కేజీల బస్తాకు ఆరు నెలకిందట రు 1450 ఉండగా ప్రస్తుతం 2150 రూపాయలు ఉందన్నారు. ఇప్పటికైనా ఇప్పటికైనా బుడ్డ శనగల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *