Breaking News

జేఈఈ మెయిన్స్ లో ఎన్ ఆర్ ఎస్ విద్యార్థుల ప్రతిభ.

93.52పర్సంటైల్ తో సత్తా చాటిన విద్యార్థులు.

పాడి పరిశ్రమ అభివృద్ధిపై కీలక చర్చలు.. సీఎం రేవంత్‌ను కలిసిన ఎన్‌డీడీబీ ప్రతినిధులు

కోదాడ: ఫిబ్రవరి 17(నేటి తెలుగు పత్రిక): సోమవారం రాత్రి ప్రకటించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలలో సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన ఎన్ ఆర్ ఎస్ ఐ ఐ టీ & మెడికల్ అకాడమీ విద్యార్థులు తమ ప్రతిభ ను కనబరచి మంచి పర్సంటైల్ సాధించినట్లు ఆ అకాడమీ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి, డైరెక్టర్ మనోహర్ రెడ్డి, కరస్పాండెంట్ వేణుగోపాల రావు, అకడమిక్ అడ్వైజర్ మైనం రామయ్య లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాలేజ్ కు చెందిన వై. శరణ్య అన్ని విభాగాలలో 93.52 పర్సంటైల్ సాధించినట్లు తెలిపారు. అదే విధంగా మ్యాథ్స్ విభాగంలో కాలేజీ కు చెందిన ఎన్ . యశస్వినిని 98.27, పీ. అమృత సుధా వర్షిణి 97.69 పర్సంటైల్ సాధించినట్లు వారు తెలిపారు. కాలేజ్ కు చెందిన 50 మంది విద్యార్థులకు పైగా 90కి పైగా పర్సంటైల్ సాధించి ఐఐటీ లు, ఎన్ ఐ టీ లలో సీట్లు పొందేందుకు అర్హత సాధించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం కాలేజ్ లో జరిగిన కార్యక్రమంలో చైర్మన్ వడ్డే రాజేష్,డైరెక్టర్ మనోహర్ రెడ్డి, కరస్పాండెంట్ వేణుగోపాల రావు, ప్రిన్సిపాల్ గంధం వెంకటరమణ,అకడమిక్ అడ్వైజర్ మైనం రామయ్య,వైస్ ప్రిన్సిపాల్ పీ ఎన్ ఆర్, క్యాంపస్ ఇంచార్జి మౌనిక, పలువురు లెక్చరర్లు అభినందించారు.

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ పనులకు స్పీడ్.. అదనపు భూసేకరణకు సర్కార్ చర్యలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *