విజయవాడ: ఫిబ్రవరి 17 పశ్చిమ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: రంజాన్ మాసం ప్రారంభం సందర్బంగా మర్కజ్ ఇమామ్ ఇబ్నే బాజ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సోసైటీ అధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ మొహ మ్మద్ ఆధ్వర్యంలో మంగ ళవారం పంజా సెంటర్ వద్ద గల షాజహర్ ముసా ఫిర్ ఖానాలో పేద ముస్లిం మహిళలకు రేషన్ కిట్స్ పంపిణీ కార్యక్రమం జరి గింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ హాజరై ముస్లిం మహిళలకు రేషన్ కిట్స్ పంపిణీ చేశారు.తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముహ మ్మద్ ఫతావుల్లా పర్యవేక్ష ణలో జరిగిన ఈ కార్యక్ర మంలో 400 మంది ముస్లిం పేదలకు రూ2500 విలువ గల రేషన్ కిట్స్ పంపిణీ చేయటంజరిగింది.ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లా డుతూ సోసైటీ చేస్తున్న సేవలను కొనియాడారు. మర్కజ్ ఇమామ్ ఇబ్నే బాజ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సోసైటీకి తన పూర్తి సహకారం వుంటుందని, ఇటువంటి సోసైటీలు దేశ అభివృద్దికి దోహదపడతా యన్నారు. రంజాన్ మాసం బుధవారం నుంచి ప్రారంభం కానున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరలంతా రంజాన్ మాసంలో దేశ అభివృద్ది కోసం, రాష్ట్రాభి వృద్ది కోసం ప్రార్ధనలు చేయాలని ఆకాంక్షించారు ఆటోమొబైల్ రంగంలో ముస్లిం సోదరుల పాత్ర ఎంతో వుందని, నగరాభి వృద్దిలో వారి పాత్ర మరు వలేనిదన్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం మైనా ర్టీలకు అండగా వుంటుం దని స్పష్టం చేశారు. అలా గే ముస్లిం పేద మహిళలు స్వయం ఉపాధి రంగంలో రాణించే విధంగా తోడ్పాడు అందించాలని మర్కజ్ ఇమామ్ ఇబ్నే బాజ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సోసైటీ నిర్వాహ కులకు ఎంపీ కేశినేని శివనాథ్ సూచించారు. గత ఏడాది కాలం నుంచి మహిళలకు హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్. డి లో నైపు ణ్యాభివృద్ది శిక్షణ కేశినేని ఫౌండేషన్ ద్వారా ఇప్పిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి సహాయ సహకారాలు అందిస్తానని సోసైటీ నిర్వాహకులకు తెలిపారు. ముస్లిం సమజ అభివృద్ది కోసం నిరంత రం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మర్కజ్ మజీద్ ఇమామ్ మౌలానా అబూ హోరేరా మదని, తెలుగు ప్రసంగికులు మౌలానా రబ్బాని, హనీఫ్ లతో పాటు ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

