బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి: రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి: రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

కరీంనగర్, ఫిబ్రవరి- 17, నేటి తెలుగు పత్రిక: ప్రత్యేక సమగ్ర సవరణ దృష్ట్యా మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఈ.ఆర్.ఓ., ఏ.ఈ.ఆర్.ఓ లతో ప్రత్యేక సమగ్ర సవరణకు ముందుగా చేపట్టిన మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులకు సహాయ సహకారాలు అందిస్తూ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని, ఇందుకు గాను గ్రామ పాలన అధికారులు, ఇతర అధికారులను బూత్ స్థాయి అధికారులకు మ్యాపింగ్ లో సహాయకులుగా నియమించి మ్యాపింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడి వారి పార్టీ నుంచి బూత్ స్థాయి ఏజెంట్లను నియమించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టాలని, బూత్ స్థాయి అధికారుల పర్యవేక్షకులు, ఏఈఆర్ఓ లు వారికి మ్యాపింగ్ చేయడంలో సహాయ సహకారాలు అందించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జరిగేలా పకడ్బందీగా ప్రక్రియ చేయాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారుల వివరాలు ప్రజలకు తెలిసేలా ప్రచారం నిర్వహించాలని, పెండింగ్ లో ఉన్న ఫారం 6, 7, 8 దరఖాస్తులను త్వరిత గతిన పరిష్కరించాలని తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్లో కరీంనగర్ కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయి పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి