Breaking News

సాయిగూడెంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 17 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు మండలం సాయిగూడెం గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రోజు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు సమక్షంలో కేక కట్ చేసి అనంతరం పనులు పంపిణీ చేశారు. వేడుకలకు కార్యకర్తలు గ్రామస్తులు హాజరై కేసీఆర్కు దీర్ఘాయుష్, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షులు గంగాధరి సుధీర్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన తో పాటు రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ చేసిన కృషి చిరస్మరణీయ మని పేర్కొన్నారు. వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులు సంక్షేమ పథకాల అమలు లో ఆయన తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర కురువదికి విశాల్యం దేశం చేశాయని అన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ బండి పృధ రాణి శ్రీనివాస్ , బిజని బాలరాజ్ ,ఇంకా రాజు , మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు కొండ రామచంద్రా రెడ్డి , మద్యపాక లక్ష్మయ్య, గోపు మహేందర్ రెడ్డి, మద్యపాక నరసయ్య, అంజాత, గంగాధరి రాజు సంఘి స్వామి, కళ్యాణ్ రవి, అలెటి నరసయ్య , గొప్పపురం వెంకటేష్, బొడ్డు మహేందర్, పిల్లట్ల శేషాద్రి , మద్యపాక కృష్ణ , ఏరా నాగేష్ , గ్యార సుదర్శన్, ఆల్వాల చంటి, తదితరులు పాల్గొన్నారు…

పాడి పరిశ్రమ అభివృద్ధిపై కీలక చర్చలు.. సీఎం రేవంత్‌ను కలిసిన ఎన్‌డీడీబీ ప్రతినిధులు

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ పనులకు స్పీడ్.. అదనపు భూసేకరణకు సర్కార్ చర్యలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *