బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

పాత్రికేయుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కొలుసు పార్థసారధి

పాత్రికేయుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కొలుసు పార్థసారధి

ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ డైరీ ఆవిష్కరణ.

విజయవాడ, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మీడియా కీలక స్థానం కలిగి ఉందన్నారు. పాత్రికేయులు సమాజానికి దిశానిర్దేశం చేసే శక్తిగా నిలుస్తారని కొనియాడారు. వారి సంక్షేమం, భద్రత, వృత్తి గౌరవం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ డైరీని మంత్రి బుధవారం సచివాలయంలోని తన ఛాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో మీడియా వంతెనలా పనిచేస్తుందని తెలిపారు. బాధ్యతాయుతమైన జర్నలిజం ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తుందని చెప్పారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

ఈ డైరీకి సంపూర్ణ ప్రాయోజకత్వం అందించిన అన్విత గ్రూప్ చైర్మన్ బొప్పన అచ్చుతరావు, డైరెక్టర్ బొప్పన నాగభూషణంలను మంత్రి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. పాత్రికేయుల కార్యక్రమానికి కార్పొరేట్ సంస్థలు సహకరించడం శుభపరిణామమని, ఇలాంటి సహకారం సమాజానికి మేలు చేస్తుందని పేర్కొన్నారు. యూనియన్ అధ్యక్షుడు చావా రవి, కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివ, కోశాధికారి ఏడుకొండలు, యూనియన్ నాయకులు జి. విజయకుమార్, గోపీనాథ్, బొప్పన రవికుమార్, మల్లికార్జునరావు, నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. ఈ డైరీ పాత్రికేయుల వృత్తి కార్యకలాపాలకు ఎంతో ఉపయోగకరమని మంచి సమాచారం పొందుపరిచారని సభ్యులు అభిప్రాయపడ్డారు.