Breaking News

కర్ల రాజేశ్ కుటుంబానికి నిత్యవసర సరుకుల పంపిణీ.

కోదాడ ,ఫిబ్రవరి 18(నేటి తెలుగు పత్రిక): పోలీసుల చేత చిత్రహింసలకు గురై మరణించిన కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం జరగాలని, అదేవిధంగా హత్యకు కారకులైన పోలీసులపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని గత 4 నెలల నుండి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో కోదాడ నియోజకవర్గంతో పాటు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి ఆధ్వర్యంలో పోరాటాలు చేయడం జరుగుతున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ నందాలాల్ పవర్ ఆదేశానుసారం బుధవారం కర్ల రాజేష్ ఇంటి వద్ద వారి తల్లి కర్ల లలితమ్మ కి కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ, కోదాడ తాహాసిల్దార్ వజిద్ అలి మూడు నెలలకు సరిపడ రైస్, నిత్యవసర సరుకులను అందజేయడం జరిగినది.అదేవిధంగా కర్ల లలితమ్మ కు ఎస్సీ కమిషన్ జాతీయ సభ్యులు, వడ్డేపల్లి రామచందర్, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సమక్షంలో ప్రకటించిన డబల్ బెడ్ రూమ్, మూడెకరాల భూమి, పర్మినెంట్ జాబులను జిల్లా కలెక్టర్ సమక్షంలో అందజేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో కోదాడ ఆర్ఐ రాజేష్, జి పి ఓ తండు నగేష్,ఏపూరి రాజు మాదిగ,ఎం ఎస్ పి జిల్లా అధికార ప్రతినిధి,34వ వార్డు కౌన్సిలర్ గంధం బాలేంద్ర పాండు, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నాయకులు కొండపల్లి ఆంజనేయులు, ఏపూరి సత్యరాజు, పంది పవన్ కుమార్, కుర్రి నాగరాజు, కర్ల శివ, జంగపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

గీత కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలి: సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ.

రైతులకు రెండు పంటలకు పూర్తి స్థాయిలో సాగునీరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *