బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

బుగ్గ లో చెత్త తొలగింపు పనుల్లో పారిశుద్ధ్య కార్మికులు.

బుగ్గ లో చెత్త తొలగింపు పనుల్లో పారిశుద్ధ్య కార్మికులు.

బెల్లంపల్లి, ఫిబ్రవరి 18:( నేటి తెలుగు పత్రిక): బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామపంచాయతీ పరిధిలో గల శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వద్ద మూడు రోజులపాటు జరిగిన శివరాత్రి జాతర ఉత్సవాలు ముగిసిన అనంతరం పారిశుద్ధ్య కార్మికులు చెత్త తొలగింపు కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ఈనెల 16న బుగ్గ అటవీ ప్రాంతంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలతో పాటు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల నుండి దాదాపు రెండు లక్షలకు పైగా భక్తులు పాల్గొన్నారు. మూడు రోజులపాటు బుగ్గ ప్రాంతం భక్తులతో రద్దీగా మారడంతో అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్ధాలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. బుగ్గ గూడెం, గొండుగూడెం, అంకుశం అటవీ మార్గాల్లో బోనాలు సమర్పించి వనభోజనాల అనంతరం భక్తులు ప్లాస్టిక్ వ్యర్ధాలు వదిలేసి వెళ్లారు. పెద్ద ఎత్తున భక్తులు రావడం తో ఈసారి (ప్లాస్టిక్ వ్యర్ధాలు) చెత్తను తొలగించేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు చర్యలు చేపట్టారు. అటవీ ప్రాంతంలో పేరుకుపోయిన చెత్త నిలువలను తొలగించేందుకు మరో వారం రోజులు పడుతుందని బుగ్గ జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ దూడం మహేష్ తెలిపారు. బుగ్గ గూడెం, కన్నాల, తాండూర్ గ్రామపంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సిబ్బంది చెత్తను డంపింగ్ యార్డ్ లకు తరలించే పనులను చేపడుతున్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు