Breaking News

రాచవీడు వీరభద్రుడు.

పులివెందుల, ఫిబ్రవరి 18(నేటి తెలుగు పత్రిక): రాయలసీమలో ఎన్నో పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. ఒక్కో పుణ్యక్షేత్రానికి ఒక్కో చరిత్ర ఉంది. అన్నమయ్య జిల్లా, రాయచోటి పట్టణంలోని మాండవ్య నది తీరాన వెలిసిన అతి పురాతనమైన దేవాలయం “శ్రీ వీరభద్ర స్వామి ఆలయం” భద్రకాళి సమేతుడై ఈ ఆలయంలో ఉండటంతో ప్రతి ఒక్కరిని ఆలయం ఎంతగానో ఆకర్షిస్తుంది. పరమ శివుని జటాజూటము నుండి ఆవిర్భవించిన ప్రళయకాల వీరభద్రుడు శివుని ఆజ్ఞ మేరకు దక్ష యాగం ధ్వంసం గావించి దక్ష సంహార మొనర్చి తన కర్తవ్యం ముగియగానే భూలోకమున పరమేశ్వరుని పుణ్యక్షేత్రాలను దర్శించాడు. చివరకు మహా మహి మాన్వితమై మాండవ్య మహాముని తపో బలముచే పునీతమైన ఈ మాండవ్య నదీ తీరమున భద్రకాళీ సమేతుడై అర్చామూర్తిగా అవతార సమాప్తి నందిని అందుచే ప్రాణ పురుషుడైన శ్రీ వీరభద్ర స్వామి వారి ఆలయము లన్నింటికీ ఈ దివ్య క్షేత్రంమూలస్థానమైనది. రాజాధి రాజులెందరో వీడిదిచేసివీరఖడ్గములర్పించి,వారిచేనిత్యంరాజోపచారములతో సేవింప బడిన వీరభద్ర స్వామి రాచరాయుడిగా పేరుగాంచెను. అందుచే రాచ రాయుని నివాసమైన ఈ ప్రాంతం “రాచవీడు” పేరుగాంచి కాలాంత రమున రాయచోటి గానామాంతరము చెందింది. ఇప్పటికీ కన్నడ భక్తులు ఈ గ్రామమును “రాచోటి”అని కూడా పిలుచుట గమనార్హము.ఈ విధంగా ప్రాచీన కాలమందే కొలువై వెలిసిన శ్రీ రాచవీటి వీరభద్ర స్వామి వారి ఆలయ నిర్మాణం మునుపు 8వ శతాబ్దపు రాజాధిరాజా చోళ కాకతీయ గణపతి దేవుడు తదుపరి శ్రీ కృష్ణదేవరాయలు ఇత్యాది రాజులెల్లరూ ఆయాకాలములందు ఆలయ నిర్మాణం, జీర్ణోద్ధరణ కార్యముల నొనర్చినట్లు శాసనముల ద్వారా తెలియుచున్నది. ప్రస్తుతం కనబడు గర్భాలయం పదహారవ శతాబ్దపు సదాశివ రాయలచే జీర్ణోద్ధరణ గావించాడు బడినది. శ్రీ రాచవీటి వీరభద్ర స్వామి వారు విశేషించి వీర శైవుల లకు ఇలవేల్పుగా వెలసినారు. ఈ దివ్య క్షేత్రము వీర శైవ పుణ్యక్షేత్రములతో శ్రీశైల వ తదుపరి ప్రథమ స్థానము వహించినది. ఈ క్షేత్రమున ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం మీన మాస మీనలగ్నము అనగా మార్చి 26వ తేదీ నుండి 5 రోజులు పర్యంతము శుభోదయం 6 గంటల ప్రాంతం నందు సూర్య భగవానుడు తన సహస్ర అరుణ కిరణాలతో గర్భాలయము స్వామి వారి దివ్య పాదములను సోకుట ఓ విశేషం. ఈ ఆలయానికి మహోన్నతమైన రాజ గోపురాలు తూర్పు, ఉత్తరం, దక్షిణమున మూడు ఉన్నాయి.

అందమైన బొమ్మలతో మూడంతస్తుల ప్రధానాలయానికి పూర్వ భాగం ఉంది.జీవకళ ఉట్టిపడే అపురూపమైన శిల్పాలు ఆలయ కోడల పై దర్శన మిస్తాయి పలు దేవాలయాల లో ఉన్న ధ్వజస్తంభం పరిశీలించగా వీరభద్రుని ఆలయంలో ఉన్న 56 అడుగుల ధ్వజస్తంభానికి 3వ స్థానం లభించిందని చరిత్రకారుల అభిప్రాయం. దీప స్తంభంపై పూర్వం కార్తీక మాసంలో దీపాలంకరణ చేసేందుకు చట్టం ఉండేవట ప్రస్తుతం అవి కనిపించడం లేదు. ఆలయంలో ఎడమ వైపున ఆ మధ్యనే విఘ్నేశ్వరుని గుడి నిర్మించారు కర్ణాటక రాష్ట్రంలో అక్కడక్కడ వీరభద్రుని ఆలయాలు వెలసి ఉన్నాయి. అక్కడ దొరికిన కొన్ని తాళపత్రాలు ఆధారంగా చేసుకుని ఆలయ పూర్తి చరిత్రను పుస్తకరూపంలో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని డి.వి. రమణారెడ్డి తెలిపారు. ప్రతి ఏడాది స్వామివారికి ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. మరో మహా శివరాత్రి పర్వదినాన 11 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు వేడుకలు కన్నుల పండుగగా జరుపుకుంటారు ఈ బ్రహ్మోత్సవాలకు చుట్టుపక్కల కర్ణాటక, మహారాష్ట్ర నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.స్వామిని దర్శించి తమ మొక్కుబడులు చెల్లించుకోవడంటారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్త జన సందోహంతో ఆలయంనిత్యం కిటకిట లాడుతుంది. పట్టణ కళాకారులుఅనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దూరప్రాంతాలనుండి వచ్చిన వారికి అన్నదానవసతి కల్పిస్తారు. ప్రస్తుతం ఈ ఆలయం కార్యనిర్వహణ అధికారిగా డి.వి.రమణారెడ్డి పనిచేస్తున్నారు.శ్రీ వీరభద్ర స్వామి ఆలయమును శ్యాండ్ బ్లాస్టింగ్ చేయించి పూర్తి చేసినందున శ్యాండ్ బ్లాస్టింగ్ పనులకు రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విశితంగా పరిశీలించి అపురూపమైన రాతి కల చక్రాలను మంత్రి ఆధ్వర్యం లో ఆలయమును అభివృద్ధి చేసినందుకు వాటిని చూసి అలనాటి రాతి కట్టడాలను తిరిగి పూర్వ వైభవం వచ్చినందున మంత్రి రాంప్రసాద్ రెడ్డికి కర్ణాటక రాష్ట్ర భక్తులు అభినందించిన విషయం అందరికీ తెలిసిందే. కర్ణాటక నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి వచ్చే భక్తులు దేవస్థానం నందు అభివృద్ధి పనులు చేయుటకు శక్తి వంచన లేకుండా అభివృద్ధి చేయగల వాడని కన్నడ భక్తులు, పలువురు ప్రముఖులు తెలియజేసిన విషయం మనకు తెలిసిందే. ఆలయమునందు శ్యాడ్ బ్లాస్టింగ్ చేయుటకు ప్రాంతీయ సంయుక్త కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ తిరుపతి వారి ఆదేశాల మేరకు తెలిపియున్నారు. కార్యనిర్వాహణాధికారి వారు 1.7. 2022 నుండి 31.3.2025 వరకు ఆలయానికి వచ్చిన ఆర్థిక వనురుల ను 4,78,00112 రూపాయలు దేవస్థానం పేరుతో ఎఫ్డి చేసియున్నారని మంత్రి మరియు కన్నడ భక్తులకు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డి.వి.రమణారెడ్డి కి అభినందించిన విషయం పట్టణ ప్రజలందరికీ తెలిసిందే.

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *