బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

మంగళగిరి శివాలయ రథానికి నూతన శోభ

మంగళగిరి శివాలయ రథానికి నూతన శోభ

మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో రూ.25 లక్షల పునరుద్ధరణ.

మంగళగిరి ఫిబ్రవరి 18 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): మంగళగిరిలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంకు చెందిన పురాతన రథం మంత్రి నారా లోకేష్ సొంత నిధులు రూ.25 లక్షలు వెచ్చించి పునరుద్ధరించారు. ఏళ్ల తరబడి మరమ్మతులు లేక ఊగిసలాడుతున్న ఈ రథంపై స్వామివారి ఊరేగింపులు నిర్వహించేవారు. భక్తులు పలుమార్లు రథం దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే..ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ ప్రత్యేక దృష్టి సారించి రథానికి సమగ్ర మరమ్మతులు చేయించి, కొత్తగా అలంకార రంగులు వేయించి శోభాయమానంగా తీర్చిదిద్దించారు. పునరుద్ధరించబడిన రథం ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి గ్రామోత్సవానికి వినియోగించబడింది. రథం నూతన రూపంలో దర్శనమివ్వడంతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు. దేవస్థానం చరిత్రాత్మక ప్రాధాన్యతను కాపాడుతూ భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని చేపట్టిన ఈ చర్యపై స్థానికులు మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పునరుద్ధరించిన రథంతో స్వామివారి ఊరేగింపు వైభవంగా సాగింది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్