Breaking News

రైతులు భాగస్వామ్యంతోనే రీ సర్వే: కలెక్టర్ డీకే బాలాజీ

పామర్రు, ఫిబ్రవరి 18( నేటి తెలుగు పత్రిక): జిల్లాలో రీ సర్వే కార్యక్రమం రైతుల భాగస్వామ్యంతో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా నడుస్తోందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ పామర్రు నియోజకవర్గం పరిధిలో ని పమిడిముక్కల మండలం తాడంకి గ్రామంలో పర్యటించి గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. రీ సర్వే కార్యక్రమానికి సంబంధించిన రికార్డులను పరిశీలించి సర్వేయర్లతో రీ సర్వే ఎలా చేశారు, ఏమైనా సమస్యలు వచ్చాయా, తేడాలు ఉంటే ఏం చేశారు అని వివరాలు అడిగి తెలుసుకునీ దిశా నిర్దేశం చేశారు.అనంతరం గ్రామాల్లో పొలాలను సందర్శించి రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఏమైనా ఉన్నాయా, ముందుగా నోటీసులు పంపారా లేదా అని విచారించారు. రైతుల భూములకు సంబంధించిన సర్వే రేఖా చిత్రపటాలను కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో రీ సర్వే కార్యక్రమం క్షేత్రస్థాయిలో ఎలా జరుగుతుందో పరిశీలించేందుకు గ్రామాల్లో పర్యటిస్తున్నామన్నారు. నిజంగా రైతుకు భూమిపైన సరిహద్దులు పెట్టకు ముందు వాళ్లకు నోటీసులు అందజేశారా లేదా అని విచారిస్తున్నామన్నారు.రైతులందరికీ సమాచారం ముందుగా ఉందని వారి సమక్షంలోనే సర్వే జరుగుతుందని రైతులు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు.అంతే కాకుండా భూముల విస్తీర్ణంలో ఎక్కడైనా ఏమైనా తేడా ఉంటే ఎలా పరిష్కరించాలో కూడా సరైన మార్గ నిర్దేశం కూడా చేశామన్నారు.రైతుల భాగస్వామ్యంతోనే ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా రీ సర్వే జరపాలని అధికారులందరినీ ఆదేశించామన్నారుఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట తహసిల్దారు నవీన్ కుమార్, సర్వేయర్లు, సచివాలయ సిబ్బంది, పలువురు రైతులు పలువురు రైతు లు పాల్గొన్నారు.

ఐలాపురం భాస్కర శ్రీనివాస్ ని పరామర్శించిన రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్దన్,ఆకుల తిరుమలరావు.

మాజీ చైర్మన్ అడపా శేషు గారిని పరామర్శించిన రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్దన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *