Breaking News

అప్పులు చేయడంలో వైకాపా, టీడీపీ కూటమి ప్రభుత్వాలు దొందూ దొందే.

రైతుల రుణభారంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం-డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి.

మచిలీపట్నంలో శుభకర ఆయుర్వేద సేవలు 18 ఏళ్లుగా ప్రజలకు నిస్వార్థ వైద్యం: రంగనాధ్

పులివెందుల ఫిబ్రవరి 18 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): రాష్ట్రాన్ని అప్పుల కుప్పచేయడంలో, అప్పుల ఊబి లోకి దించడంలో అటు వైకాపా ప్రభుత్వం,ఇటు టిడిపి కూటమి ప్రభుత్వం దొందు దొందే అని అని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి విరుచుకుపడ్డారు. బుధవారం వేంపల్లి లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వం శక్తికి మించి అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిందని టిడిపి కూటమి పార్టీలు విమర్శించాయి.అదే పని ప్రస్తుతం టిడిపి కూటమి ప్రభుత్వం చేస్తున్నదని తులసి రెడ్డి అన్నారు. ఒక విధంగా చెప్పాలంటే అంతకుమించి అప్పులు చేస్తున్నదని అన్నారు. కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అన్న సామెత లా ఉందని ఎద్దేవా చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి 20 నెలలు అయింది. ఈ 20 నెలల కాలంలో రు 3,28,225 కోట్ల రూపాయలు అప్పు చేసింది.ఇందులో బడ్జెట్ ద్వారా ప్రత్యక్ష అప్పు రు 1,79,668 కోట్లు, వివిధ కార్పొరేషన్ల ద్వారా రు 1,01,170 కోట్లు, రాజధాని అమరావతి కోసం రు 47,387 కోట్లు. ఈ అప్పు ఆల్ టైం రికార్డ్. ఇప్పటివరకు ఇంత స్వల్ప కాలంలో ఇంత ఎక్కువ అప్పు ఏ రాష్ట్రము చేయలేదు. అప్పుల్లో కూటమి ప్రభుత్వానికి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. కాగ్ నివేదిక ప్రకారం 2025- 26 ఆర్థిక సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలలో దేశంలోని 28 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఎక్కువ అప్పు చేసింది. ఆంధ్రప్రదేశ్ రు 85,269కోట్లు అప్పు చేయగా, తెలంగాణ రు 65930 కోట్లు కర్ణాటక రు 19766 కోట్లు,కేరళ రు 38,124 కోట్లు,తమిళనాడు రు 72,130 కోట్లు, బీహార్ రు 80092 కోట్లు,ఒరిస్సారు 911 కోట్లు,ఉత్తర ప్రదేశ్ రు 11315 కోట్లు అప్పు చేశాయి. మనకంటే నాలుగు రెట్లు పెద్దదైన ఉత్తరప్రదేశ్ కేవలం రు 11315 కోట్లు అప్పు చేయగా ఆంధ్రప్రదేశ్ రు 85 వేల 269 కోట్లు అప్పు చేయడం గమనార్హం.
2026- 27 బడ్జెట్లో 98065 కోట్లు అప్పు చేస్తామని ప్రస్తావించడం జరిగింది . అంటే మొత్తం బడ్జెట్లో 30% అప్పులే. ఇందులో వడ్డీలకు చెల్లిస్తున్నది 18 శాతం. ఏమి చేస్తున్నావు కోడలు పిల్ల అంటే ఉలకపోసి ఎత్తుకుంటున్నాను అత్తమ్మ అన్నట్లు ఉంది. అప్పులు తేవడం, వడ్డీలు చెల్లించడం ఇదే ప్రభుత్వం పని అన్నట్లుంది.రైతుల రుణభారంలో జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన ఉండడం శోచనీయం. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పార్లమెంటులో చెప్పిన ప్రకారం జాతీయస్థాయిలో సగటు రైతు రుణభారం 74,121 రూపాయలు కాగా,ఆంధ్రప్రదేశ్లో సగటు రైతు రుణభారం రు 2,45,000 అంటే జాతీయ సగటు కంటే ఆంధ్రప్రదేశ్లో రైతుల రుణభారం 7 రెట్లు ఎక్కువగా ఉంది.ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం శక్తికి మించి అప్పులు చేయవద్దని, రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేయవద్దని,రుణాంధ్రప్రదేశ్ చేయవద్దని కాంగ్రెస్ పార్టీ సూచిస్తుందని తులసి రెడ్డి అన్నారు. శనిగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షనీయం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీలైనన్ని ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని తులసి రెడ్డి విజ్ఞప్తి చేశారు. మద్యం మత్తులో మదనపల్లెలో కులవర్ధన్ అనే ఒక తాగుబోతు ఏడు సంవత్సరాల చిన్నారి రిషిక ప్రియ పై అత్యాచారం చేయడం,హత్య చేయడం అత్యంత విచారకరం. ఇప్పటికైనా మద్యం పాలసీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని తులసి రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

బస్సులపై విధిస్తున్న రోడ్ ట్యాక్స్, పర్మిట్ ఫీజులను తగ్గించాలని మంత్రికి వినతి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *