బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

బీబీనగర్ ఎయిమ్స్ లో ఇన్స్టిట్యూట్ బాడీ సమావేశంలో పాల్గొన్న బోర్డు మెంబెర్ ఎంపీ చామల.

బీబీనగర్ ఎయిమ్స్ లో ఇన్స్టిట్యూట్ బాడీ సమావేశంలో పాల్గొన్న బోర్డు మెంబెర్ ఎంపీ చామల.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 19 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): గురువారం రోజు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ , బీబీనగర్ 6వ ఇన్‌స్టిట్యూట్ బాడీ సమావేశంలో ఎయిమ్స్ బోర్డు మెంబెర్ భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు . ఈ సమావేశంలో గవర్నింగ్ బాడీ, స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ, స్టాండింగ్ అకడమిక్ కమిటీ, స్టాండింగ్ సెలెక్షన్ కమిటీ, స్టాండింగ్ ఎస్టేట్ కమిటీ మరియు హ్యూమన్ రిసోర్స్ సబ్ కమిటీ ఏర్పాటు అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ సమావేశం ఇన్‌స్టిట్యూట్ బాడీ అధ్యక్షులు చంద్రశేఖర్ మహాదేర మేశ్రం అధ్యక్షతన జరిగింది. రాజ్యసభ సభ్యులు కే లక్ష్మణ్ , ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితా అగగర్వాల్ , సభ్యులు త్రితంకర్ దేబ్ , పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో ఇంటర్నల్ మెడిసిన్ విభాగాధిపతి సంజయ్ జైన్ , అలాగే కేమ్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ C. S. యజనిక్ పాల్గొన్నారు.ఈ కమిటీల ఏర్పాటు ద్వారా సంస్థ పరిపాలన బలోపేతం కావడం, ఆర్థిక పారదర్శకత పెరగడం, విద్యా ప్రమాణాలు మెరుగుపడడం, నియామక ప్రక్రియ సక్రమీకరణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. తెలంగాణలో అత్యున్నత వైద్య సేవలు, విద్య మరియు పరిశోధన రంగాలలో ఎయిమ్స్ బిబినగర్ మరింత పురోగమించేందుకు ఈ చర్యలు కీలకంగా నిలుస్తాయని తెలిపారు .

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్