Breaking News

అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పూర్తిచేయాలి.

మంగళగిరి ఫిబ్రవరి 19 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పూర్తయ్యేలా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు.గురువారం మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల పనులు పురోగతిని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పరిశీలించారు.  ఖాజా లోని యానిమల్ బర్త్ కంట్రోల్ (ఎబిసి) కేంద్రంలో డాగ్స్ కెన్నల్స్, ఫ్రీ ఆపరేషన్ గది, ఆపరేషన్ గది, ఫుడ్ ఫీడింగ్ ఏరియాను , రికార్డులను పరిశీలించారు. ఎబిసి సెంటర్ లో వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ సర్జరీలు సజావుగా నిర్వహించి పూర్తి ఆరోగ్యంగా ఉండేలా నిరంతరం వైద్య సేవలు అందించాలన్నారు. కేంద్రాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కాజాలో ఎ 17. 18 సెంట్లలోని ఈస్ట్ లేక్ వద్ద  రూ.2.70 కోట్లు తో ఏర్పాటు చేస్తున్న వాకింగ్ ట్రాక్, పిల్లల పార్కు, మొక్కల పెంపకం పనులను, ఎన్ ఆర్ ఐ సమీపంలో ఎంటీఎంసీ, సిఎస్ఆర్ నిధులు రూ.46 లక్షలతో 0.75 ఎకరాల్లో నిర్మిస్తున్న వైట్ ఫీల్డ్ పార్కులో పనులను కలెక్టర్ పరిశీలించారు. పూర్తి స్థాయిలో పచ్చదనం ఉండేలా చర్యలు తీసుకోవాలని, వాకింగ్ ట్రాక్ పూర్తిగా చదునుచేయాలని, పార్క్ ల నిర్వహణ సజావుగా కొనసాగించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కాళి మాత దేవాలయం సమీపంలో స్వయం సహాయక సంఘాల సభ్యుల నిర్వహణలో పనిచేస్తున్న యాస్పిరేషనల్ టాయిలెట్లను పరిశీలించారు. పర్యావరణహితంగా ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టేందుకు అవగాహన కల్పిస్తూ అక్కడ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎనీ టైం బ్యాగ్ కీయోస్కీ పనితీరును పరిశీలించారు. మరుగుదొడ్ల నిర్వహణ చక్కగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. కొలనుకొండలో కమ్యూనల్ స్థలాలను పరిశీలించి, నివేదిక అందించాలని తహశీల్దార్ కు సూచించారు. తాడేపల్లి లోని ఆంధ్ర రత్న పంపింగ్ స్టేషన్ నుంచి పాతురు వెళ్లే రోడ్డులో మెప్మా ఆధ్వర్యంలో 40 షాపులతో ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ స్ట్రీట్ స్థలాన్ని పరిశీలించారు. ప్రజలకు ఆహ్లాదకరంగా వాతావరణంలో స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులు అమ్ముకునేలా స్మార్ట్ స్ట్రీట్ ను తీర్చిదిద్దాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. స్మార్ట్ స్ట్రీట్ రాష్ట్రంలో ప్రథమంగా ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు.
ట్రాఫిక్ రద్దీ కి అనుగుణంగా రూ.1.69 కోట్ల తో అభివృద్ధి చేస్తున్న ఉండవల్లి సెంటరులో పనులను పరిశీలించారు. రాజధాని ప్రాంతం నుంచి వచ్చే వాహనాలకు ఇబ్బందులు లేకుండా విస్తరణ పనులను సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. నులకపేటలోని నాలుగు ఎకరాల చెరువును అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ. ఆరు కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించి, అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. తాడేపల్లి తహసిల్దార్ కార్యాలయంను, స్వర్ణ వార్డు కార్యాలయంను సందర్శించి, అన్ని విభాగాలను పరిశీలించారు. కార్యాలయాలు పరిశుభ్రత మరింతగా మెరుగుపరచాలని కలెక్టర్ అధికారులు సూచించారు. పొడి వ్యర్థాల నిర్వహణకు ప్రకాష్ నగర్ లో నూతనంగా రూ. 96.74 లక్షలతో నిర్మించి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు.  పొడి వ్యర్థాలతో పాటు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సక్రమంగా నిర్వహణ చేయాలని అధికారులకు సూచించారు. ఎంటీఎంసీ పరిధిలో జరుగుతున్న అన్ని అభివృద్ధి పనులను వేగవంతం చేసి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు.

కేరళకు కేంద్రం పంపిన జీవో ఉపసంహరించాలి…!

ఈ కార్యక్రమంలో తెనాలి ఇన్చార్జి సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారి, ఎంటీఎంసీ కమిషనర్ అలీంబాషా, తహశీల్దార్లు దినేష్ రాఘవేంద్ర, సీతారామయ్య, అదనపు డిప్యూటీ కమిషనర్ శకుంతలా దేవి, డిప్యూటీ కమిషనర్లు శ్రీకాంత్, శ్రీనివాసరావు, డీసీపీ అశోక్, ఎస్సీ లీలా కృష్ణ, ఎడీసీఎల్ ఈఈ బసవేశ్వర రావు, సెక్రటరీ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

నిబంధ‌న‌ల మేర‌కు జ‌ర్న‌లిస్టుల‌కు అక్రెడిటేష‌న్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *