Breaking News

కృష్ణారావుపాలెం సేంద్రియ మేళాకు ప‌టిష్ట ఏర్పాట్లు: జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌

ఎ. కొండూరు ఫిబ్రవరి 19 (నేటి తెలుగు పత్రిక): ఈ నెల 21న ఎ.కొండూరు మండ‌లం, కృష్ణారావుపాలెంలో భారీస్థాయిలో జిల్లాస్థాయి సేంద్రియ మేళా నిర్వ‌హించ‌నున్నామ‌ని.. ఈ కార్య‌క్ర‌మానికి ప‌టిష్ట ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ తెలిపారు.గురువారం జేసీ ఇల‌క్కియ‌.. తిరువూరు ఆర్‌డీవో కె.మాధురితో క‌లిసి మేళా జ‌రిగే ప్రాంతంలో ఏర్పాట్ల‌పై స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు, భాగ‌స్వామ్య ప‌క్షాల‌తో స‌మావేశ‌మ‌య్యారు. శిక్ష‌ణ‌, అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు, స్టాళ్ల ఏర్పాటు, సేంద్రియ వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల ప్ర‌ద‌ర్శ‌న త‌దిత‌రాల‌కు చేస్తున్న ఏర్పాట్ల‌పై దిశానిర్దేశం చేశారు. ఈ సంద‌ర్భంగా జేసీ ఇల‌క్కియ మాట్లాడుతూ రైతులు, వినియోగ‌దారులు పెద్దఎత్తున పాల్గొని కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు. సేంద్రియ ఉత్ప‌త్తుల‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంపొందించ‌డం, సేంద్రియ సాగుపై రైతుల‌కు సామ‌ర్థ్య అభివృద్ధి, శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం ల‌క్ష్యంగా జిల్లా ప్ర‌కృతి వ్య‌వ‌సాయ విభాగం ఆధ్వ‌ర్యంలో ఈ మేళాను ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ మేళాలో సేంద్రియ ఉత్ప‌త్తుల ప్ర‌ద‌ర్శ‌న‌, విక్ర‌య స్టాళ్లు ఉంటాయ‌ని, సేంద్రియ సాగుకు అవ‌స‌ర‌మైన ఉత్పాదితాలను కూడా ప్ర‌ద‌ర్శించ‌నున్న‌ట్లు తెలిపారు.ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతులు, వినియోగ‌దారులు, సంస్థ‌ల‌ను ఒకే వేదిక‌పైకి తీసుకొచ్చే ల‌క్ష్యంతో ఈ నెల 22వ తేదీన విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మునిసిప‌ల్ మైదానంలో ప్ర‌కృతి వ్య‌వ‌సాయ మేళాను నిర్వ‌హించ‌నున్న‌ట్లు జాయింట్ క‌లెక్ట‌ర్ ఇల‌క్కియ తెలిపారు. కార్య‌క్ర‌మంలో డీపీఎం వై.శంక‌ర్ నాయ‌క్ మండల తహశీల్దార్ ఎన్. అరవింద్ ఎంపీడీవోలు బొజ్జ గాని శ్రీనివాసరావు రవిబాబు వ్యవసాయ శాఖాధికారులు షేక్ టిప్పు సుల్తాన్ హరీష్ పద్మ విజయ్ నాగరాజు నాయక్ ఎంఈఓ 2 ఈ ఎల్ సి కేశవరావు ఎంఆర్ఐ దివ్య ప్రసాద్ ఏటీఎం యెహోషువ సీఐ కె గిరిబాబు ఎస్ఐ గంధం మహా లక్ష్మణుడు పీహెచ్ సి డాక్టర్ దివ్య వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

బీజేపీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలి: సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఫైర్.

ఐలాపురం భాస్కర శ్రీనివాస్ ని పరామర్శించిన రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్దన్,ఆకుల తిరుమలరావు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *