Breaking News

యూరియా వాడకంపై రైతులు అపొహలు వీడాలి: మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి

కరీంనగర్,నేటి తెలుగు పత్రిక :యూరియా వాడకంపై రైతులు అపొహలు వీడి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం ఆయన మానకొండూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలానికి చెందిన 90 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ యూరియాను అధికంగా వాడితే అధిక దిగుబడి వస్తుందనే అపొహ చాలా మంది రైతుల్లో ఉందన్నారు. వాస్తవానికి ఇది నిజం కాదని, అపొహ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. మోతాదుకు మించి యూరియాను మోతాదుకు మించి వాడటం వల్ల మొక్కలు బలహీనంగా మారడమే కాకుండా నాణ్యత కూడా తగ్గుతుందన్నారు. అధిక యూరియా వాడటం వల్ల పంటపైననే కాకుండా ప్రజారోగ్యంపైన కూడా తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. యూరియా వాడకంపై రైతులను చైతన్యపర్చాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యామ్నాయ సేంద్రీయ ఎరువుల వాడకంపై అవగాహన కల్పించేందుకు వ్యవసాయశాఖ సన్నద్ధం కావాలన్నారు. యూరియా సమస్య జిల్లాకో, నియోజకవర్గానికో పరిమితం కాదని, ఇది దేశవ్యాప్త సమస్యగా మారిందన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు యూరియాకు కృత్రిక కొరత సృష్టిస్తున్నారని, అలాంటి వారిపట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అప్లయ్ చేసుకోవడమే తప్ప రిప్లయ్ వచ్చేది కాదని కవ్వంపల్లి ఎద్దేవా చేశారు. పదేళ్లలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇంటికి నోచుకోలేని నిరుపేదలు కాంగ్రెస్ పాలనలో సొంతింట కలను సాకారం చేసుకుంటున్నారన్నారు. మానకొండూర్ మండలం తొలి విడతగా ఇందిరమ్మ ఇంటి పథకం కింద 850 ఇండ్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు 90 శాతం మేరకు నిర్మాణాలు జరిగాయని, రానున్న కొద్ది రోజుల్లో వాటిని పూర్తి చేసి గృహ ప్రవేశాలకు ఇందిరమ్మ ఇళ్లు సిద్ధం కానున్నాయన్నారు. మానకొండూర్ మండలానికి 23వ విడత కింద 90 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు 23,95,500 లక్షల రూపాయలు మంజూరు కాగా, వాటిని ఇప్పుడు చెక్కుల రూపేణా అందజేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వీవీ వరలక్ష్మి, ఇంచార్జీ తహసీల్దార్ నరేందర్, ఎంపీవో సతీష్ రావు, మానకొండూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నందగిరి రవీంద్రచారి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్, వైస్ చైర్మన్ ఆర్.తిరుమల్ రెడ్డి, లక్ష్మీపూర్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సంపత్ గౌడ్, మద్దికుంట సర్పంచులు ఎడ్ల సత్యనారాయణ, బుర్ర శ్రీధర్ గౌడ్, పార్టీ నాయకులు మడుపు ప్రేమ్ కుమార్, తాళ్ల నరేష్, కోండ్ర సురేష్, కొత్తకొండ శంకర్, రామిడి తిరుపతి, సాయిరి దేవయ్య, గోపు శ్రీనివాస్ రెడ్డి, తోట శ్రీనివాస్, గొల్లెన కొమురయ్య, కనకం సంపత్, కనకం కుమార్,నాగిశెట్టి రాజయ్య, గుజ్జ ప్రభాకర్, ఎన్.బాబురావు, కె.చిరంజీవి, దూలం దేవేంద్ర, మంద రమాదేవి, ముక్కిస సతీష్ కుమార్, రామకృష్ణ, మహేందర్, దాసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సామ్రాజ్యవాదాన్ని తరిమికొడదాం.

హైదరాబాద్ మెట్రోపై కీలక మలుపు.. కేబినెట్ భేటీలో తుది నిర్ణయం?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *