బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

హైదరాబాద్ మెట్రోపై కీలక మలుపు.. కేబినెట్ భేటీలో తుది నిర్ణయం?

హైదరాబాద్ మెట్రోపై కీలక మలుపు.. కేబినెట్ భేటీలో తుది నిర్ణయం?

నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో కీలకమైన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి ముందే ప్రాజెక్టును టేకోవర్ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఫైనాన్స్, టెక్నికల్ అంశాలపై సమగ్ర పరిశీలనలు పూర్తయ్యాయి.మెట్రో టేకోవర్ ప్రక్రియపై సాంకేతిక విశ్లేషణ కోసం ప్రభుత్వం టెక్నికల్ కన్సల్టెంట్‌గా Delhi Metro Rail Corporation ను నియమించింది. దేశవ్యాప్తంగా మెట్రో ప్రాజెక్టుల అమలు, నిర్వహణలో అనుభవం ఉన్న ఈ సంస్థ పనితీరు, భవిష్యత్ విస్తరణ, నిర్వహణ సామర్థ్యాలపై వివరమైన నివేదిక సమర్పించింది.ఇక ఆర్థిక, న్యాయ అంశాల పరిశీలన కోసం IDBI Bank ను ఫైనాన్స్ మరియు లీగల్ అడ్వైజర్‌గా నియమించారు. ఒప్పంద నిబంధనలు, అప్పులు, బకాయిల చెల్లింపులు, ఆర్థిక బాధ్యతలపై సమగ్ర రిపోర్ట్ ప్రభుత్వానికి అందింది.

ప్రస్తుతం హెచ్ఎంఆర్ఎల్ మరియు Larsen & Toubro (ఎల్ అండ్ టీ) మధ్య కీలక చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒప్పందాల పునర్వ్యవస్థీకరణ, బకాయిల పరిష్కారం, భవిష్యత్ నిర్వహణ విధానంపై స్పష్టతకు వచ్చే దశలో చర్చలు ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.ఈ నెల 23న జరిగే కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే టేకోవర్ ప్రక్రియ వేగవంతం కానుంది. మార్చి 31లోగా మొత్తం స్వాధీన ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.టేకోవర్ అనంతరం సేవల విస్తరణ, కొత్త కారిడార్ల ప్రణాళిక, చార్జీల విధానం, నిర్వహణలో మార్పులు వంటి అంశాలు ప్రాధాన్యతకు రానున్నాయి. ప్రభుత్వ నియంత్రణలోకి వస్తే భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలు మరింత వేగంగా అమలవుతాయని అధికారులు భావిస్తున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి