Breaking News

సామ్రాజ్యవాదాన్ని తరిమికొడదాం.

కోదాడ , ఫిబ్రవరి 21 (నేటి తెలుగు పత్రిక): అమెరికా సామ్రాజ్యవాదం తన ఆధిపత్యాన్ని తన ఆయుధ బలగాన్ని ఉపయోగించి ప్రజాస్వామ్య దేశాల పైన యుద్ధాలు ప్రకటించి ఆయిలను కొల్లగొట్టేందుకు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అన్నారు .స్థానిక సుందరయ్య భవనంలో సిపిఎం కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా శనివారం ఫిబ్రవరి 21 న రెడ్ బుక్ డే సందర్భంగా బరితెగించిన అమెరికన్ సామ్రాజ్యవాదం అనే పుస్తకం పై నియోజకవర్గ స్థాయిలో సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా నెమ్మది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ట్రంపు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక దేశాల మధ్య యుద్ధాలను సృష్టిస్తూ ప్రపంచంలో అశాంతిని సృష్టిస్తూ ఆయుధాలను అమ్ముకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల వెనిజులాలో ప్రజాస్వామ్యకితంగా ఎన్నికైన ఆదేశ అధ్యక్షుడు నికోలస్ మధురో ను అతని భార్యను అర్ధరాత్రి కిడ్నాప్ చేసి అమెరికాకు తరలించడం ఏ మమైనా చర్య అని ఆయన విమర్శించారు .అట్లాగే గతంలో అమెరికా ఇరాక్ లిబియా చిలి ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుల్ని హతమార్చి తన కీలుబొమ్మ ప్రభుత్వాలును పెట్టుకొని చమురు ఆధిపత్యాన్ని చలామణి చేశారని ఆయన అన్నారు .ఆయా దేశాల పైన యుద్ధాలు చేసి తన ఆయుధ సంపదను అమ్ముకుంటున్నారని ఆయన విమర్శించారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత సుంకాల పేరుతో భారత్ పై యుద్ధం ప్రకటించారని అమెరికా ట్రంప్ తనపై సుంకాల విధిస్తుంటే మోడీ మాత్రం మౌనవ్రతం వీడలేదని ఆయన విమర్శించారు సామ్రాజ్యవాదం లాంటి విష సర్పాలను అంతమొందించకపోతే ప్రపంచ శాంతికి మనుగడ ఉండదని ఆయన అన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఈ సమావేశానికి రాపోలు సూర్యనారాయణ అధ్యక్ష వహించగా ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎస్కే సైదా జిల్లెపల్లి నరసింహారావు జూలకంటి విజయలక్ష్మి బెల్లంకొండ సత్యనారాయణ సిపిఎం జిల్లా నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు మునగాల సిపిఎం మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు అలసగాని బ్రహ్మయ్య నాగటి రాములు ఉయ్యాల నరసయ్య దేవర వెంకటరెడ్డి వీరబోయిన వెంకన్న చందా చంద్రయ్య మండవ వెంకటాద్రి సోంపంగు జానయ్య ఆరే రామకృష్ణారెడ్డి జుట్టుకొండ వీరయ్య కొండమడుగుల చిన్న వెంకటేశ్వర్లు గోపతి బిక్షం తదితరులు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *