విజయవాడ. ఫిబ్రవరి 21 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మన నగరం, మనందరి బాధ్యతని, విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం పున్నమి ఘాట్ భవానిపురంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మన నగరం, మనందరి బాధ్యతని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా నిర్వ హించి నగరంలో వ్యర్ధాలను ఎక్కడపడితే అక్కడ పోయకుండా కేవలం చెత్త బుట్టలోనే వేయాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవ హరించి నగరంలో పారిశుద్ధ్య కార్మికులకు తోడుగా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ వ్యర్థాలను కేవలం చెత్తబు ట్టలోనే వేయాలని ఇంటి వద్దనే వ్యర్థాలను విభజించి నగరపాలక సంస్థ వారికి అప్పజెప్పాలని ఎరుపు, నీలం, పచ్చ బుట్టలను సద్వినియోగం చేసకోవాలని, హానికరమైన వ్యర్ధాలు వేరే చెత్తబుటలో వేస్తే పారిశుద్ధ్య కార్మికులు వాటిని తీసేటప్పుడు వారికి ప్రమాదం కలిగే అవకాశం ఉంటుందని కావున దాని గమనించి ప్రజలందరూ వ్యర్ధాలను వేరుచేసి పరిశుద్ధ కార్మికులకు ఇవ్వాలని అన్నారు. తదుపరి దోమలు పెరగకుండా ఎలా నిర్మూలించాలని వంటి అంశాలపై అక్కడికొ చ్చే ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన స్టాల్, ఇంట్లోనే ఎరువులు తయారు చేసే స్టాల్, వ్యర్ధాలను రీసైకిల్ ఎలా చేయాలి అని అవగాహన కల్పించే స్టాల్స్ ను సందర్శించారు. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను నాటారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా జీరో వెస్ట్ లిటర్ గురించి, చెత్తను బహిరంగ ప్రదేశాలలో వేయొద్దు చెత్త బుట్టనే వాడండి అనే నినాదాలతో రాలిని నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) డాక్టర్ డి.చంద్రశేఖర్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు సి డి) విజ యలక్ష్మి, జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, ఎగ్జిక్యూటి వ్ ఇంజనీర్ శ్రీనివాస్, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ, బయా లజిస్ట్ కామేశ్వరరావు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

