Breaking News

తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ లో రాజ్యాంగ నైతికతపై సదస్సు.. కీలకోపన్యాసం చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి.

నేటి తెలుగు పత్రిక: 2026 ఫిబ్రవరి 21న మధ్యాహ్నం 2:30 గంటలకు సికింద్రాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర జ్యూడిషియల్ అకాడమీ ప్రాంగణంలో, తెలంగాణ న్యాయమూర్తుల సంఘం మరియు తెలంగాణ రాష్ట్ర జ్యూడిషియల్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక సెమినార్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి భారత సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ ముఖ్య అతిథిగా హాజరై, “రాజ్యాంగ నైతికత మరియు జిల్లా న్యాయవ్యవస్థ పాత్ర” అనే అంశంపై కీలకోపన్యాసం చేశారు. భారత రాజ్యాంగాన్ని సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువల పునాదిపై బి. ఆర్. అంబేద్కర్ రూపొందించారని ఆయన పేర్కొన్నారు. ఆ రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి న్యాయ మూర్తిదని, రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజలకు న్యాయం అందించే విధంగా వ్యవహరించాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేస్ కుమార్ సింగ్ “ప్రజా విశ్వాసం మరియు న్యాయం మధ్య అంతరాన్ని తగ్గించడంలో జిల్లా న్యాయవ్యవస్థ పాత్ర” అనే అంశంపై ప్రసంగించారు. ప్రజల న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని మరింత బలపర్చే దిశగా జిల్లా కోర్టులు కీలక పాత్ర పోషించాలన్నారు.కార్యక్రమానికి తొలుత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి మరియు అకాడమీ అధ్యక్షురాలు మౌషుమి భట్టాచార్య స్వాగత ఉపన్యాసం చేశారు.ప్రిన్సిపల్ జిల్లా & సెషన్స్ జడ్జి, ఖమ్మం మరియు తెలంగాణ న్యాయమూర్తుల సంఘం అధ్యక్షులు శ్రీ జి. రాజగోపాల్ కార్యక్రమంలో ప్రసంగించారు. అదనపు జిల్లా న్యాయమూర్తి మరియు సంఘ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. మురళీమోహన్ గౌరవ అతిథులను వేదికపైకి ఆహ్వానించి కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.

రాజ్యాంగ విరుద్ధమే కుల–మత వివక్ష.. బలమైన బేస్‌తోనే న్యాయవ్యవస్థ బలోపేతం: ఉజ్జల్ భుయాన్.

ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్ జనరల్, అకాడమీ డైరెక్టర్ శ్రీమతి ఎస్.ఎన్. శ్రీదేవి, సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులు డా. సున్నం శ్రీనివాస్ రెడ్డి, రాధాకృష్ణ చాహవాన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా న్యాయమూర్తులు ప్రత్యక్షంగా మరియు వర్చువల్‌గా హాజరయ్యారు.కార్యక్రమంలో 15 నిమిషాల పరస్పర చర్య, అతిథులకు సన్మానం, వందన సమర్పణ అనంతరం జాతీయ గీతంతో ముగిసింది. హైటీ ఏర్పాటుతో కార్యక్రమం సాఫీగా ముగిసింది.

పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *