Breaking News

తెలంగాణ PGECET 2026 నోటిఫికేషన్ విడుదల.. ఫిబ్రవరి 27 నుంచి దరఖాస్తులు

నేటి తెలుగు పత్రిక: తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్) 2026 నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈ పరీక్షను ఈ ఏడాది కూడా జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం హైదరాబాద్ (జేఎన్‌టీయూ-హెచ్) ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.పీజీఈసెట్ ర్యాంక్ ఆధారంగా 2026–27 విద్యా సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అఫిలియేటెడ్ ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కళాశాలల్లో ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్, గ్రాడ్యుయేట్ లెవెల్ ఫార్మ్ డి కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.

అర్హతలు:

సంబంధిత కోర్సు ప్రకారం బీఈ, బీటెక్ లేదా బీఫార్మసీ ఉత్తీర్ణత అవసరం. ఏరోస్పేస్, సివిల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, బయోటెక్నాలజీ, ఫార్మసీ తదితర విభాగాల్లో ప్రవేశాలు ఉంటాయి.

లోక్‌సభ సీట్ల పెంపుపై అఖిలపక్ష సమావేశం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి

దరఖాస్తు వివరాలు:

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: ఫిబ్రవరి 27, 2026
  • ఆలస్య రుసుము లేకుండా చివరి తేదీ: మే 06, 2026
  • రిజిస్ట్రేషన్ ఫీజు:
    • జనరల్ అభ్యర్థులు: రూ.1100
    • ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు: రూ.600

ఆలస్య రుసుములతో తేదీలు:

  • రూ.250తో: మే 09
  • రూ.1,000తో: మే 12
  • రూ.2,500తో: మే 15
  • రూ.5,000తో: మే 18
  • రూ.10,000తో: మే 26

ఇతర ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తు సవరణ: మే 09–10
  • హాల్ టికెట్ డౌన్‌లోడ్: మే 19 నుంచి
  • పరీక్ష తేదీలు: మే 28–31 (ఆన్‌లైన్ విధానం)

పరీక్ష విధానం:

  • వ్యవధి: 2 గంటలు
  • ప్రశ్నలు: 120 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు
  • ప్రతి ప్రశ్నకు 1 మార్కు
  • నెగటివ్ మార్కింగ్ లేదు

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలని అధికారులు సూచించారు.

మహిళా రిజర్వేషన్లపై బీజేపీ వైఖరిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *