Breaking News

జమిలి ఎన్నికల నేపథ్యం.. కేంద్ర–రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల కీలక చర్చలు

నేటి తెలుగు పత్రిక: భారత ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో Election Commission of India (కేంద్ర ఎన్నికల సంఘం) కీలక కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం ఢిల్లీలోని Bharat Mandapamలో కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల జాతీయ రౌండ్ టేబుల్ సమావేశం మంగళవారం జరగనుంది.

గత 27 ఏళ్ల తర్వాత కేంద్ర మరియు రాష్ట్ర ఎన్నికల అధికారులు ఒకే వేదికపై సమావేశమవడం విశేషం. చివరిసారిగా ఇలాంటి సమావేశం 1999లో జరిగింది. ఈ సమావేశంలో ఈవీఎంలు (EVMలు), ఓటర్ల జాబితాలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ఎన్నికల నిర్వహణ విధానాల బలోపేతంపై విస్తృత చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ Gyanesh Kumar అధ్యక్షత వహిస్తారు. ఎన్నికల కమిషనర్లు Sukhbir Singh Sandhu, Vivek Joshi సమక్షంలో చర్చలు కొనసాగనున్నాయి. 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రధాన ఎన్నికల అధికారులు (CEOలు), చట్టపరమైన, సాంకేతిక నిపుణులు పాల్గొననున్నారు.

కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. ‘కేరళ’ ఇకపై ‘కేరళం’

సమావేశంలో ECINET డిజిటల్ ప్లాట్‌ఫామ్, ఎన్నికల సేవల క్రమబద్ధీకరణ, సాంకేతికత వినియోగంపై ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పటిష్టత, పారదర్శకత, భద్రత అంశాలపై ప్రత్యేక చర్చలు జరుగనున్నాయి.అలాగే Representation of the People Act, 1950కు సంబంధించిన చట్టపరమైన మార్గదర్శకాలు, ఓటర్ల అర్హత ప్రమాణాలపై చర్చిస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 243K, 243ZA ప్రకారం పంచాయతీలు, మున్సిపల్ సంస్థలకు ఎన్నికల జాబితా తయారీ, నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ల అధికారాలపై కూడా సమీక్షించనున్నారు.దేశవ్యాప్తంగా SIR ప్రక్రియ, అలాగే రాబోయే జమిలి ఎన్నికల చర్చల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల నిర్వహణలో సహకార సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేయడమే ఈ సమావేశం ప్రధాన లక్ష్యంగా పేర్కొంటున్నారు.

అమెరికా సంక్షోభానికి ప్రతిబింబమే ట్రంప్‌ చర్యలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *