బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదాల కోసం విస్తృత అవగాహన సదస్సు…!

రోడ్డు ప్రమాదాల కోసం విస్తృత అవగాహన సదస్సు…!

విజయవాడ. ఫిబ్రవరి 24 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎస్.వి. రాజశేఖర్ బాబు, ఐపిఎస్ వారి ఆదేశాల మేరకు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ షేక్ షరీన్ బేగం, ఐపిఎస్ వారి ఆధ్వర్యంలో రోడ్డు ప్రమా దాల నివారణ కోసం విస్తృత అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. హెల్మెట్ తప్ప నిసరిగా ధరించడం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని ప్రజలకు చైతన్యం కల్పిస్తూ కౌన్సిలింగ్‌లు, అవగాహన పోస్టర్లు, సైనేజీలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించబడుతున్నాయి. ఈ చర్యల ఫలితంగా ప్రజల్లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. హెల్మెట్ ధరించడం మాత్రమే కాకుండా, స్ట్రాప్‌ను సక్రమంగా బిగించుకోవడం వల్లనే ప్రాణరక్షణ సాధ్యమవుతుందని ప్రజలకు తెలియజేయడం జరుగుతోంది. ఈ సందేశాన్ని మరింత ప్రభావవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, మంగళవారం త్రీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కిషోర్ బాబు కొత్తూరి ఆధ్వర్యంలో, ట్రాఫిక్ డిసిపి సమక్షంలో, ఆదిత్య కాలేజ్ (బెంజ్ సర్కిల్) విద్యార్థుల సహకారంతో బీఆర్‌పీఎస్ రోడ్ ఫుడ్ జంక్షన్ వద్ద హెల్మెట్ ధరించి ఫ్లాష్ మాబ్ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ట్రాఫిక్ పోలీసుల ప్రయత్నాలను ప్రజలు అభినందించారు.ప్రతి ఒక్కరూ హెల్మెట్‌ను సక్రమంగా ధరించి, రోడ్డు ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేయబడుతోంది.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రామారావు, WSI సరళ, సిబ్బంది, ఆదిత్య కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీ వీర్రాజు, కొరియోగ్రాఫర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్