బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

వర్షానికి ఆవిరైన ఇటుక రాయి

వర్షానికి ఆవిరైన ఇటుక రాయి

ఎన్టీఆర్ జిల్లా,నేటి తెలుగు పత్రిక: మైలవరం లో రాత్రి కురిసిన వర్షానికి ఇటుక బట్టీ నిర్వాహకులు కుదేలయ్యారు. అటు భారీగా ఏర్పాటైన ఇటుక బట్టీలతో పాటు చిన్న తరహా కుటీర పరిశ్రమగా కుటుంబంతో కలిసి బట్టీలు నిర్వహించే చిన్నపాటి బట్టీల నిర్వాహకులు దీనావస్తకు వెళ్ళారు. మైలవరం, జి.కొండూరు మండల చుట్టుప్రక్కల ప్రాంతాలలో లక్షల సంఖ్యలో ఇటుక రాయి తడిచి పోవడంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్లు సమాచారం? రాయి తయారు చేసి బట్టీ కి ఎక్కించి కాల్చడం మొదలైతే ఇంకా ఆ రాయికి ఢోకా లేనట్లే. కానీ కల్లాల్లో ఉన్న రాయి రాత్రి కురిసిన అకాల వర్షానికి తడవడంతో రాళ్ళు ఆకారాన్ని కోల్పోయి మట్టి ముద్దలుగా మారాయి. బట్టీ కి కాల్పు కోసం ఎక్కించే సమయానికి ఒక్కో రాయి తయారీకి సుమారు 4నుండి5 రూపాయల మద్యలో వ్యయం అవుతుందని బట్టీ యజమానులు చెబుతున్నారు. ఈ లెక్కన చూసుకుంటే కొన్ని కోట్ల రూపాయల ఇటుక రాయి వర్షానికి కరిపోయినట్లు తెలుస్తుంది. ప్రభుత్వం తమపై దృష్టి సారించి తమను ఆదుకోవాలని బట్టీ యజమానులు కోరుతున్నారు. ఈ అకాల వర్షంతో లక్షలాది రాళ్ళు తడవడంతో మళ్ళీ రాయి తయారు కావడానికి రెట్టింపు ఖర్చు అయ్యే అవకాశాలు ఉండడంతో ఆ భారం ఇళ్ళు కట్టుకునే గృహనిర్మాణ దారులపై పడే అవకాశం లేకపోలేదు. 2014-19మద్య 3నుండి 5రూపాయల లోపు లభ్యమయ్యే ఇటుక రాయి ఇప్పుడు 10రూపాయలు పలుకుతుంది. ఈ వర్షం మిగిల్చిన నష్టంతో మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. మైలవరం, జి.కొండూరు పరిసర ప్రాంతాల్లో మంచి నాణ్యమైన మట్టి లబిస్తుండడంతో ఈ ప్రాంతాల్లో రాయికి గిరాకీ ఉండడంతో పాటు నాణ్యత కలిగిన రాళ్ళుగా పేరు పడ్డాయి.ఇక్కడి నుండి రాజధాని ప్రాంతానికి కూడా భారీగా రాయి ఎగుమతి అవుతుంది. ఈ క్రమంలోనే తమపై భారం తగ్గే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఇటుక బట్టీ నిర్వాహకులు ప్రాథేయపడుతున్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్