బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

భక్తి శ్రద్ధల తో నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం లో పాల్గొన్న వైయస్ జగన్

భక్తి శ్రద్ధల తో నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం లో పాల్గొన్న వైయస్ జగన్

పులివెందుల ఫిబ్రవరి 25 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): కడప జిల్లా వేంపల్లె మండలం నందిపల్లిలోని నందీశ్వర ఆలయం లో నిర్వహించిన నూతన విగ్రహ ప్రతిష్ఠ (శ్రీ పార్వతీ దేవి సమేత మహా నందీశ్వర స్వామి వారు), కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ పాల్గొన్నారు.ఆలయ అర్చకులు, వేదపండితులు నిర్వహించిన ప్రత్యేక పూజ,హోమాల లో సంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొని, స్వామివారికి భక్తిశ్రద్దలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనం స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతీకలని, భక్తి మార్గం ద్వారా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందుతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం మరింత విస్తరిస్తుందని తెలిపారు.నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆలయ కమిటీ ఛైర్మన్‌ మారం శ్రీకాంత్ రెడ్డిని,కమిటీ సభ్యులను అభినందిస్తూ,ఈ కార్యక్రమం గ్రామ ప్రజల ఐక్యతకు నిదర్శనమని అన్నారు. గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రీనందీశ్వర స్వామివారి కృపాకటాక్షాలు సమస్త ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైయస్‌ అవినాష్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్