బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ప్రతి రైతు మద్దతు ధరలు సద్వినియోగం చేసుకోవాలి: టిడిపి ఇన్చార్జ్ బిటెక్ రవి

ప్రతి రైతు మద్దతు ధరలు సద్వినియోగం చేసుకోవాలి: టిడిపి ఇన్చార్జ్ బిటెక్ రవి

పులివెందుల ఫిబ్రవరి 25 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): శనగలు పండించిన ప్రతి రైతు మద్దతు ధరలు సద్వినియోగం చేసుకోవాలని టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి కోరారు. సింహాద్రిపురం లో ఏర్పాటుచేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన సతీమణి పులివెందుల జడ్పిటిసి మా రెడ్డి లతా రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ రైతుకు నష్టం రాకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అందుబాటులో ఉండేలా శనగల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట దళారుల పాలై నష్టపోకూడదన్నదే తమ లక్ష్యమన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరను ప్రతి ఒక్క రైతూ వినియోగించుకోవాలని కోరారు. గతంలో రైతులు పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఈ కొనుగోలు కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు. సింహాద్రిపురం మండలంతో పాటు పరిసర గ్రామాల శనగ రైతులందరూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడే తమ పంటను విక్రయించి లాభపడాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు, కూటమి నాయకులు పుప్పాల శ్రీధర్ రెడ్డి,సింహాద్రిపురం సింగిల్ విండో అధ్యక్షుడు పీజీ గోపాల్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్