బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

పేదల బియ్యంపై మాఫియాకు కళ్లెం

పేదల బియ్యంపై మాఫియాకు కళ్లెం

పేదల బియ్యంపై మాఫియాకు కళ్లెం: విజయవాడ పశ్చిమ తహశీల్దార్ ఇంతియాజ్ పాషా

విజయవాడ: పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై విజయవాడ పశ్చిమ తహశీల్దార్ ఇంతియాజ్ పాషా మెరుపు చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 41వ డివిజన్ భవానిపురం ప్రాంతంలో అక్రమంగా నిల్వచేసిన 2500 కిలోల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు.

పట్టుబడిన నిల్వలు
డీ.నంబర్‌ 75-5-171, ప్రెసిడెంట్ వీధిలో మరమ్మతులు జరుగుతున్న ఓ భవనంలో 50 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని నిల్వ ఉంచినట్లు స్థానికులు సమాచారం అందించారు. ఆ ఇంటి యజమాని ఎస్‌కే ఖుద్దస్ కాగా, కొల్లి తిరుపతమ్మ అనే మహిళ పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసిందని తహశీల్దార్‌కి వివరించారు.

మాఫియాకు బిగించిన కళ్లెం
కొల్లి తిరుపతమ్మ గత కొంతకాలంగా రేషన్ మాఫియాగా మారి పేదల హక్కులను దోచుకుంటూ అక్రమ లాభాలు పొందుతున్నట్లు తేలింది. తహశీల్దార్ ఇంతియాజ్ పాషా దాడి చేయడంతో ఆమె కార్యకలాపాలకు అడ్డుకట్ట పడింది. పట్టుబడిన బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

ప్రజల సహకారం కోరిన తహశీల్దార్
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరిగితే వెంటనే రెవెన్యూ అధికారులకు సమాచారం అందించాలని తహశీల్దార్ ఇంతియాజ్ పాషా ప్రజలకు సూచించారు. ప్రభుత్వం పేదల కోసం బియ్యాన్ని ఇంటివద్దకే అందిస్తున్నప్పటికీ, కొందరు మాఫియాలు పక్కదారులు పడుతుండటం దురదృష్టకరం అని అన్నారు.

దాడి దళంలో పాల్గొన్న అధికారులు
ఈ దాడిలో పశ్చిమ తహశీల్దార్ ఇంతియాజ్ పాషాతో పాటు ఇన్‌ఛార్జ్ ఆర్ఐ వెన్నెల, సివిల్ సప్లై ఆర్ఐ వెంకట్, విఆర్వోలు రాజేష్, యోసేపులు పాల్గొన్నారు. అక్రమ రవాణాను అడ్డుకున్న తహశీల్దార్ చర్యలను స్థానికులు అభినందించారు.