Breaking News

రవాణా శాఖలో ఆటోమేషన్ – ADTT, ATSల విస్తరణ

అసెంబ్లీలో బడ్జెట్ డిమాండ్‌పై చర్చలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

ఎంపి కేశినేని ను మర్యా దపూర్వకంగా కలిసిన ఎంపి బ‌స్తిపాటి…!

విజయవాడ. ఫిబ్రవరి 25 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు చొరవతో 15-08-2025న ప్రారంభించిన స్త్రీ శక్తి పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తం గా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.స్త్రీలకు ఉచిత ప్రయాణంసిటి ఆర్డినరీ, సిటి ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు సహా ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. నేటి వరకు 47 కోట్ల ప్రయాణాలు జరగగా, రూ.1660 కోట్ల సబ్సిడీ ప్రభుత్వం భరించిందన్నారు. ఈ పథకం అమలుతో మహిళా ప్రయాణికుల శాతం 40% నుంచి 65%కు పెరిగిందనీ రోజుకు సగటున 25 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని వెల్లడించారు. దివ్యాంగులకు ఉచిత ప్రయాణం. దివ్యాంగులకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశం లో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. రవాణా శాఖలో అభివృద్ధి కార్యక్రమాలు ఆటో డ్రైవర్ సేవలో” పథకం ద్వారా 2025-26లో 2,90,669 మంది డ్రైవర్ల కు రూ.436 కోట్లు ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. డోన్ కర్నూలు దర్శి (ప్రకాశం)లలో డ్రైవర్ల శిక్షణ & పరిశోధన సంస్థలు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. విశాఖపట్నం గంభీరంలో రూ.16.50 కోట్లతో I&C సెంటర్ ఏర్పాటు చేస్తున్న ట్లు చెప్పారు. ఆధునికీకరణ టెస్టింగ్ & భద్రత రాష్ట్రంలో 9 ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లు పనిచేస్తుండగా, మారుతి సుజుకి CSR కింద మరో 5 ఏర్పాటు కానున్నాయని తెలిపారు. 18 జిల్లాల్లో ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు (ATS) పనిచేస్తుండగా, మిగిలిన జిల్లాల్లో కూడా త్వరలో ప్రారంభం కానున్నాయని చెప్పారు. విధాన నిర్ణయాలు AP ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0 2024–29 ప్రకారం రాష్ట్రంలో కొనుగోలు చేసి నమోదు చేసుకున్న ఎలక్ట్రిక్ వాహనాలకు మోటార్ వాహనాలపన్ను మినహాయింపు కల్పించామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రోడ్డు భద్రతా నిధి ఏర్పాటు చేసి, అమలు ఆదాయాన్ని అందులోకి మళ్లించామని తెలిపారు. విద్యార్థులు, మహిళలకు ప్రత్యే క సౌకర్యాలు మంత్రి నారా లోకేష్ చొరవతో రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామనీ అన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసిం దని విమర్శించిన మంత్రి, ప్రస్తుతం 75% ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నామని స్పష్టం చేశారు. కొత్త బస్సులు పీఎంఈ బస్ సేవ ద్వారా 750 కొత్త బస్సులు రాష్ట్రానికి రానున్నాయని, సీఎన్‌జి, ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రతిపాద నలు పంపామని మంత్రి తెలిపారు.

ప్రతి రైతు మద్దతు ధరలు సద్వినియోగం చేసుకోవాలి: టిడిపి ఇన్చార్జ్ బిటెక్ రవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *