బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

దేశాన్ని కదిలించిన కంచికచర్ల కోటేషు సజీవ దహనం: విజయవాడలో 58వ వర్ధంతి సభ

దేశాన్ని కదిలించిన కంచికచర్ల కోటేషు సజీవ దహనం: విజయవాడలో 58వ వర్ధంతి సభ

విజయవాడ, ఫిబ్రవరి 26: సెంట్రల్ నేటి తెలు గు పత్రిక ప్రతినిధి: కంచికచర్ల కోటేషు 58వ వర్ధంతి సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గురువారం విజయవాడ గాంధీ నగర్ స్థానిక ప్రెస్ క్లబ్‌లో కోటేషు 58 వర్ధం తి సభా ఘనంగా జరిగింది. మాదిగ హక్కు కోసం మాదిగ దండోరా రాష్ట్ర అధ్యక్షుడు గిరిదపల్లి చిట్టిబాబు మాదిగ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని కోటేషుకు నివాళులర్పించారు.ఈ సందర్భంగా చిట్టిబాబు మాదిగ మాట్లాడుతూ, 1968 ఫిబ్రవరి 26న పరిటాల గ్రామానికి చెందిన మాదిగ యువకుడు అరుకుట్ల కోటేషును కంచికచ ర్లలో ఆధిపత్య కులదుర హంకారులు చిన్న దొంగతనం నెపంతో సజీవ దహనం చేశారని గుర్తుచేశారు. ఆ రోజుల్లో ఈ సంఘటన దేశవ్యాప్తంగా పెను మార్పులకు, సంచలనానీ కి దారితీసిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కృపాకర్ మాదిగ మాట్లాడుతూ, మాదిగ యువత విద్య, సాధికారత, రాజకీయ చైతన్యం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. నాణ్యమైన విద్యతో పాటు వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో వృత్తి నైపు ణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని సాధికారత సాధించడం ద్వారా పేదరికం, అంటరానితనం, నిరుద్యోగాన్ని నిర్మూలించడమే కోటేషుకు మనం అర్పించే నిజమైన నివాళి అని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏపీ తెలుగు, సంస్కృత అకా డమీల చైర్మన్ ఆర్.డి. విల్సన్, ఏపీ ఎమ్మార్పీ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ, మాజీ అధ్య క్షులు కొమ్మూరి కనక రాజు మాదిగ, పరిశ్రమల శాఖ మాజీ అదనపు డైరెక్టర్ అప్పికట్ల వల్లభాయ్ పటేల్, బిషప్ జగ్జీవన్, లేడ బుడగ జంగం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం నాగేశ్వరరావు పాల్గొన్నారు. కోటేషు కుటుంబ సభ్యులు అరుకుట్ల కోటేష్, అరుకుట్ల రమేష్ తదితరులు పాల్గొని ఆయన స్మృతికి ఘనంగా నివాళులర్పించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్