Breaking News

వేల్పుపల్లి లోని పెద్దమ్మ చెరువు శిఖం భూమి కబ్జా.

మట్టి దందా బాగోతంపై.

తుర్కపల్లి మండల బీ ఆర్ ఎస్ అధ్యక్షుడు పిన్నపు రెడ్డి నరేందర్ రెడ్డి పై విచారణ ప్రారంభించిన ఇరిగేషన్ అధికారులు.

ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో కలిసి పిన్న వయస్కుడైన కార్పోరేటర్ గుణకు ఆశీస్సులు.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 26 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వేల్పుపల్లి గ్రామంలో గల పెద్దమ్మ చెరువు సర్వే నంబర్ 80 లోని సుమారు 7 ఎకరాల చెరువు శిఖం భూమిని అక్రమంగా కబ్జా చేసి పొలాలు అచ్చుకట్టుకుని ఫెన్సింగ్ చేసి అట్టి చెరువు మట్టిని దౌర్జన్యంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్న తుర్కపల్లి మండల బీ ఆర్ ఎస్ అధ్యక్షుడు పిన్నపు రెడ్డి నరేందర్ రెడ్డిపై తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ గత సోమవారం నాడు కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ హనుమంతరావుకు లిఖిత పూర్వకంగా పిర్యాదు చేయాగ గురువారం నాడు తుర్కపల్లి ఇరిగేషన్ ఏఇఇ బిక్కు నాయక్, బాల్ నర్సయ్య లు చెరువును సందర్శించి మట్టి తవ్వకాలను పరిశీలన చేసి స్థానికుల నుండి వివరాలు అడిగి తెలుసున్నారు మట్టి అమ్మకాలు నిజమేనని నిర్ధారించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023 సంవత్సరంలో చెరువును కబ్జా చేసి ఎఫ్ టీ ఎల్ పరిధిలోని సుమారు 7 ఎకరాల చెరువు శిఖం భూమిని కబ్జా చేసి కడీలు పాతుకుని పొలం మడులు అచ్చుకట్టుకున్న విషయం పై గతంలో అతనిపై కేసులు కూడా నమోదయ్యాయని గుర్తు చేశారు ప్రభుత్వ ఆస్తిని దర్జాగా కబ్జా చేస్తూ మట్టిని అమ్ముకున్న సంబంధిత వ్యక్తిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. అతనిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కోట సురేష్,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,మాజీ వార్డు సభ్యులు జేరిపోతుల నరేందర్, మాజీ ఉప సర్పంచ్ మరియు ప్రస్తుత వార్డు సభ్యులు ధ్యాన బోయిన అచ్చయ్య, వార్డు సభ్యులు, జేరిపోతుల యాదగిరి,మరియు నాయకులు, గ్రామస్థులు, గుండా ఆంజనేయులు, లింగాల యాదగిరి,రమేష్ నాయక్ తదితరులు ఉన్నారు.

సింగపూర్ కిట్స్ కాలేజీలో ‘అరైవ్ – అలైవ్’ (ARRIVE – ALIVE) అవగాహనా సదస్సు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *