Breaking News

రాబోయే కాలంలో లెజిస్టేటివ్ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ జ‌ర‌గాల‌ ని ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఆకాంక్ష‌…!

విజయవాడ. ఫిబ్రవరి 26 సెంట్రల్, నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజ‌య‌వాడ సౌత్ ఇండి యన్ లెజిస్లేటివ్ కౌన్సిల్, అసెంబ్లీ ఎమ్మెల్యేలతో క్రికెట్ పోటీలు నిర్వహిం చాలనే స్పీక‌ర్ అయ్య‌న్నపాత్రుడు ఆలోచనను ఎంపీ కేశినేని శివనాథ్ ప్రశంసించారు. స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు ఆలోచ‌న రాబోయే కాలంలో లెజిస్టేటివ్ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ కు పునాది కావాల‌ని ఆకాంక్షించారు.ఇందిరా గాంధీ మున్సిప‌ ల్ స్టేడియంలో జ‌రుగుతున్న ఎపీ స్టేట్ లేజిస్టే టివ్ స్పోర్ట్స్ మీట్ -2026 కి ఎంపీ కేశినేని శివ‌నాథ్ గురువారం హాజ‌రై క్రీడ‌లు ఆడుతున్న ప్ర‌జాప్ర‌తినిధుల‌ను ప్రోత్స‌హించారు. ఈ సంద‌ర్బంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ రాబోయే ఏడాది లెజిస్లేటి వ్ సౌత్ ఇండియా ప్రీమి య‌ర్ లీగ్ కు వైజాగ్ స్టేడియం వేదిక కాబోతున్నందుకు ఆనందంగా వుంద‌న్నారు. వీటిని ఆహ్లాద‌క‌ర వాతా వ‌ర‌ణంలో నిర్వ‌హి స్తామ‌ని హామీ ఇచ్చారు. ఈ స్పోర్ట్స్ మీట్ ప్ర‌జాప్ర‌ తినిధుల మధ్య ఐక్యత, ఫిట్‌నెస్, క్రీడా స్పూర్తి పెంపొందిస్తుంద‌న్నారు. ప్రజా ప్రతినిధులు తమ నియోజ‌వ‌ర్గ‌ బాధ్యతలతో పాటు , స్పోర్ట్స్‌లో కూడా యాక్టివ్ గా పాల్గొన‌టాన్ని అభినందించారు. ఆల్ రౌండ‌ర్ ప్ర‌తిభ చూపుతున్న హోం మంత్రి అనిత ను ప్ర‌త్యేకంగా కొనియాడారు అలాగే ఇప్ప‌టి కి ఫిట్ నెస్ తో వుంటూ యువ‌కుల‌లా క‌నిపించే ఎమ్మెల్యేలు గ‌ద్దె రామ్మోహ‌న్, బోడే ప్ర‌సాద్ ల‌ను అభినందించారు. స్టేడియం అంతా తిరిగి ప్ర‌జాప్ర‌తినిధుల‌ను అప్యాయంగా ఎంపీ కేశినే ని శివ‌నాథ్ ప‌ల‌క‌రించారు.

కృష్ణాజిల్లా డిపిఓ కార్యాలయాన్ని అసత్య ఆరోపణలతో అల్లరి చేస్తున్న వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కార్యదర్శులు డిమాండ్.

మహిళా రిజర్వేషన్‌పై చంద్రబాబు విమర్శలు.. ఇండి కూటమిపై ఆగ్రహం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *