విజయవాడ. ఫిబ్రవరి 26 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) జాతీయ ప్రథమ మహాసభలను మార్చి 22, 23 తేదీలలో విజయవాడ నగరంలో నిర్వహించనున్నామని ఈ మహాసభల విజయవంతానికై విద్యా ర్థులు, మేధావులు కార్మికులు, కర్షకులు, వ్యాపార వాణిజ్య వర్గాలు ఆర్థికంగా, హార్దికంగా సహకరించి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థులకు ఆతిథ్యం ఇచ్చి జయప్రదం చేయాలని PDSU జాతీయ కన్వీనర్ ఎం. రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా PDSU జాతీయ ప్రథమ మహాసభల గోడపత్రికల ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడ గాంధీ నగర్ స్థానిక ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించడం జరిగింది. ఈ జాతీయ మహాసభల్లో దేశంలో విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలపై, విద్యార్థుల హక్కులకై ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నామని అదే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానం 2020 విద్యను వ్యాపార సరుకుగా మార్చివేసి వ్యాపారీకరణ కార్పోరేటీకరణను పెంచే విధంగా ఉందని దేశంలోని ప్రభుత్వ యూనివర్సిటీల్లో కులం పేరుతో మతం పేరుతో విద్యార్థుల మధ్య వివక్షలను పెంచి పోషించే విధంగా విధానాలను ప్రకటిస్తున్నారని యూజీసీ లాంటి రాజ్యాంగ సంస్థలను తమ గుప్పిట్లో పెట్టు కుని నిర్వీర్యపరుస్తున్నారని అన్నారు. దేశంలోకి విచ్చలవిడిగా విదేశీ ప్రైవేట్ యూనివర్సిటీలను అనుమతులు ఇస్తూ పేద వర్గాలకు ఉన్నత విద్యను దూరం చేస్తున్నారని అన్నారు. లక్షలాది మంది విద్యార్థులు తమ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకుని ఉద్యోగ ఉపాధి అకాశాల కోసం బయటకు వస్తుంటే వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం లో ప్రభుత్వాల విఫలమ య్యారని అన్నారు. విద్యలో శాస్త్రీయ సాంకేతక అంశాలను చేర్చకుండా కర్మకాండ సిద్ధాంతం జ్యోతిష్య శాస్త్రం ఇతిహాసాలు పుక్కిటి పురాణాలను చేర్చడం వలన భారతదేశాన్ని మూఢత్వం వైపు నడిపిస్తున్నారని అన్నారు. ఇంకా ఈ జాతీయ మహాసభల్లో విద్యారంగంలో ఉన్నటువంటి మేధావులు వివిధ విద్యా అంశాలపై చర్చించి భవిష్యత్తు విద్యార్థి ఉద్యమ కార్యాచరణను బలోపేతం చేయడానికి వేలాదిగా విద్యార్థులు ఈ మహా సభల్లో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో డి PDSU జాతీయ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు యు.గాని రాజు, ఇడంపాక విజయ్ కన్నా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మొగిలి వెంకటరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్. కిరణ్ కుమార్, రాష్ట్ర సహకార దర్శి సిద్దు తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు..
