Breaking News

అసిస్టెంట్ ప్రొఫెసర్ కుసుమకి డాక్టరేట్

పులివెందుల ఫిబ్రవరి 26 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): స్థానిక జేఎన్టీయూ కళాశాలలో ఈసీఈ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న పల్లేటి వెంకట కుసుమకి అనంతపురంలోని జేఎన్టీయూ యూనివర్సిటీ పి.హెచ్.డి ప్రధానం చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డి.విష్ణువర్ధన్ తెలిపారు. జెఎన్టియు పులివెందుల యూనివర్సిటీలో ఆచార్యులుగా పనిచేస్తున్న ప్రొఫెసర్ ఎస్. చంద్రమోహన్ రెడ్డి పర్యవేక్షణలో డిజైన్ ఆఫ్ ఇంప్రూవ్డ్ యు-నెట్ అండ్ హైబ్రిడ్ క్లాసిఫికేషన్ మోడల్స్ ఫర్ అక్యురేట్ బ్రెయిన్ ట్యూమర్ డయాగ్నసిస్ అనే శీర్షికపై పి. వెంకట కుసుమ పరిశోధన పూర్తి చేశారు. ఈ పరిశోధనలో, మెదడు ట్యూమర్‌ను అత్యంత ఖచ్చితత్వంతో, వేగంగా మరియు విశ్వసనీయంగా గుర్తించడానికి ఆధునిక మెషిన్ లెర్నింగ్ మరియు డీప్ లెర్నింగ్ సాంకేతికతలను ఉపయోగించి మెరుగైన వర్గీకరణ నమూనాలను అభివృద్ధి చేయడం జరిగింది.ఈ పరిశోధన ఫలితాలు వైద్య రంగంలో మెదడు ట్యూమర్ నిర్ధారణలో గణనీయమైన మెరుగుదలకు దోహదపడతాయని, తద్వారా రోగుల ప్రాణరక్షణకు మరియు సమర్థవంతమైన చికిత్సకు మార్గం సుగమం చేస్తాయని అన్నారు. ఈ సందర్భంగా గైడ్ ప్రొఫెసర్ ఎస్ చంద్రమోహన్ రెడ్డి, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డి. విష్ణువర్ధన్, ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యాపక, అధ్యాపకేత్ర సిబ్బంది ఆమెను అభినందించారు.

కృష్ణాజిల్లా డిపిఓ కార్యాలయాన్ని అసత్య ఆరోపణలతో అల్లరి చేస్తున్న వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కార్యదర్శులు డిమాండ్.

మహిళా రిజర్వేషన్‌పై చంద్రబాబు విమర్శలు.. ఇండి కూటమిపై ఆగ్రహం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *