బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ప్రైవేట్ స్కూల్స్‌కు సీఎం రేవంత్ మాస్ వార్నింగ్.. అధిక ఫీజులపై కఠిన చర్యలు.

ప్రైవేట్ స్కూల్స్‌కు సీఎం రేవంత్ మాస్ వార్నింగ్.. అధిక ఫీజులపై కఠిన చర్యలు.

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజుల వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు అతిక్రమించి అదనపు ఫీజులు వసూలు చేసే పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర విధానం రూపొందించేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ నివేదికపై సమీక్ష నిర్వహించిన సీఎం, అధిక ఫీజులు వసూలు చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేయడంతో పాటు అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని రికవరీ చేసేలా నిబంధనలు రూపొందించాలని సూచించారు. ఫీజుల నియంత్రణపై సిద్ధం చేసిన ప్రతిపాదనలను ప్రజాభిప్రాయం కోసం అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచాలని కూడా ఆదేశించారు.

హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన ఈ సమీక్షలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కోర్ అర్బన్ ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు.ప్రభుత్వ పాఠశాలల్లో కూడా భారతీయ విద్యా భవన్, జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ స్థాయి సదుపాయాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

అదనంగా, ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి ప్రతి విద్యార్థికి పాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పాలను విజయ డెయిరీ నుంచి సేకరించాలని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యత పర్యవేక్షణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై పరిశీలన చేయాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల ప్రభుత్వ పాఠశాల మోడల్‌ను విస్తరించి, విద్యార్థులకు రవాణా సదుపాయాలతో కూడిన పూర్తి సౌకర్యాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. విద్యార్థుల రవాణా కోసం ఎలక్ట్రిక్ బస్సుల అవకాశాలపై కూడా అధ్యయనం చేయాలని సూచించారు.ఇక రాష్ట్రంలో సమగ్ర విద్యా విధానం కోసం కమిషన్ 305 పాఠశాలలను సందర్శించి, 46 సమావేశాల ద్వారా అభిప్రాయాలు సేకరించి నివేదిక సమర్పించింది. తెలంగాణ పబ్లిక్ స్కూల్ మోడల్ అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుండటంతో విద్యారంగంలో విస్తృత చర్చ నెలకొంది.