Breaking News

దర్జీల బతుకులలో దర్జా మాయం- నేడు టైలర్స్ డే

పులివెందుల ఫిబ్రవరి 27 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): సాధారణ వస్త్రాన్ని కత్తిరించి, కలిపి కుట్టి ఓ రూపు తెచ్చేది దర్జీలు.. ఆ దుస్తులు మనిషికి దర్జాను తీసుకువస్తాయి. ఇలా ఓ మనిషికి డ్రెస్సులతో హుందాతనాన్ని తీసుకువస్తున్న దర్జీల బతుకుల్లో మాత్రం దర్జా మాయమవుతోంది. రెడీమేడ్ దుస్తుల రాకతో ఉపాధి కరువైంది. కుల వృత్తినే నమ్ముకున్నవారి పరిస్థితి దయనీయంగా మారింది. చాలా మంది బతుకుదెరువుకోసం గల్ఫ్స్బట పడుతున్నారు. కొందరు ఇతర పనులను వెతుక్కుంటున్నారు. ఆదివారం వరల్డ్ టైలర్స్ డే సందర్భంగా దర్జీల స్థితిగతులపై ఓ కథనం. గతంలో మేరు కులానికి చెందిన వారు మాత్రమే దర్జీ వృత్తిని చేపట్టేవారు. పండుగలు, శుభకార్యాల సమయంలో వారికి చేతినిండా పని ఉండేది. తిందామన్నా తీరిక ఉండేది కాదు. కాల క్రమంలో ఇతర కులాల వారూ దర్జీ వృత్తిని స్వీకరించడంతో మేరులకు పని తగ్గింది. రెడీమేడ్ దుస్తుల రాకతో పరిస్థితి దయనీయంగా మారింది. మార్కెట్లోకి వస్తున్న కొత్త కొత్త ఫ్యాషన్లకు అనుగుణంగా బట్టలు కుట్టే నేర్పు ఉన్నా.. రెడీమేడ్ దుస్తుల వల్ల వారికి ఆదరణ తగ్గుతూ వస్తోంది. ఒక డ్రెస్ కుట్టడానికి అయ్యే కూలి ధరలోనే రెడీమేడ్ దుస్తులు లభిస్తుండడంతో.. చాలా మంది వాటినే కొనుగోలు చేస్తున్నారు. దీంతో దర్జీలకు ఉపాధి తగ్గిపోయింది. పండుగల సమయంలోనూ గిరాకీ ఉండడం లేదు. చేయడానికి పనిలేకపోవడంతో పలువురు దర్జీ వృత్తిని వదులుకుని బతుకుదెరువుకోసం గల్ఫ్ బాటపట్టారు. గల్ఫ్ దేశాలలో భవన నిర్మాణ కార్మికులుగా, వాచ్మన్లుగా, కార్మికులుగా పని చేయడానికి వెళ్తున్నారు. కొందరు కులం వృత్తిని వదులుకోలేక స్థానికంగానే ఉంటున్నారు. పోటీ ప్రపంచంలో దూసుకెళ్తున్న దర్జీలు ఫిబ్రవరి 28న టైలర్స్ డే నాగరికత ప్రపంచంలో మారుతున్న కాలానికి అనుగుణంగా టైలర్స్ తమ నైపుణ్యాన్ని మరింత పదునుపెట్టుకుంటూ వివిధ పోటీలను ఎదుర్కొంటూ దూసుకెళ్తున్నారు. ఒకప్పుడు సంప్రదాయ కుట్టు పనులకే పరిమితమైన టైలరింగ్ విధానం, ఇప్పుడు ఆధునిక డిజైన్లు, ఫ్యాషన్ ట్రెండ్స్‌కు అనుగుణంగా విస్తరించింది. అటు మహిళలు, ఇటు పురుషులు ఈ రంగంలో తమ ప్రతిభను చాటుకుంటూ ముందుకు సాగుతున్నారు.
మార్కెట్‌లో లభించే రెడీమేడ్ దుస్తులకు పోటీగా, వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టు ప్రత్యేక నమూనాలతో దుస్తులు తయారు చేస్తూ దర్జీలు తమ స్థానాన్ని నిలబెట్టుకుంటున్నారు. దయనందిన జీవితంలో కుటుంబ పోషణలో టైలరింగ్ ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ఎంతో కష్టపడి పనిచేస్తూ తమ బిడ్డలను మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ఘనత కూడా ఈ వృత్తి నిర్వాహకులకే దక్కుతుంది. వారి సేవలను, వృత్తి నిబద్ధతను గౌరవించే ఉద్దేశంతో ప్రతి ఏటా ఫిబ్రవరి 28వ తేదీన టైలర్స్ డే జరుపుకుంటున్నారు. సమాజ నిర్మాణంలో నిశ్శబ్దంగా పాత్ర పోషిస్తున్న దర్జీలకు ఇది ఒక గౌరవ దినంగా నిలుస్తోంది.

టైలర్స్ డే చరిత్ర.
కుట్టు మిషన్ లేని రోజులలో షర్టు, ప్యాంట్లను కాస్త అటుఇటుగా చేతితోనే కుట్టేవారు. జర్మన్ దేశానికి చెందిన విలియమ్స్హో అనే శాస్త్రవేత్త 1916లో కుట్టుమిషన్లను కనుగొన్నారు. ఆయన ఫిబ్రవరి 28న జన్మించారు. ఆయన జన్మదినాన్ని టైలర్స్ డే గా నిర్వహిస్తున్నారు.

శాసన మండలి ప్రతిపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ త్వరగా కోలుకోవాలి.

ప్రోత్సాహం కరువు.
టైలరింగ్ వృత్తిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని దర్జీలు ఆరోపిస్తున్నారు. కార్పొరేషన్ల ద్వారా అంతంత మాత్రంగానే రుణాలిస్తోంది. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని దర్జీలు కోరుతున్నారు.

ఏపీలో ఇళ్ల కోసం వేచి చూస్తున్న వారికి శుభవార్త.. వచ్చే నెలలో భారీ కార్యక్రమం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *