బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

రాయలసీమ ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై వైసీపీపై ఘాటు విమర్శలు

రాయలసీమ ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై వైసీపీపై ఘాటు విమర్శలు
  • అప్పట్లో లిఫ్ట్ ఆపేసి.. ఇప్పుడు నాటకాలు ఎందుకు? మండలిలో మంత్రుల ప్రశ్న
  • ఒక్క సంతకంతో 102 ప్రాజెక్టులు రద్దు చేశారంటూ వైసీపీపై విమర్శలు
  • “ఏం చేయలేదని మీరు ఒప్పుకున్నారు” – సభలోనే ఘాటు వ్యాఖ్యలు
  • మీరు అన్యాయం చేస్తే.. ఎన్. చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తున్నారు
  • రాయలసీమ అభివృద్ధి మహాయజ్ఞానికి అడ్డుపడొద్దని హెచ్చరిక
  • మండలిలో మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, కింజరాపు అచ్చన్నాయుడు ఫైర్

అమరావతి,ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక): అమరావతిలో జరిగిన శాసనమండలి సమావేశంలో రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ అంశంపై తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.రాయలసీమ లిఫ్ట్ పనులు ఆగిపోయిన విషయంపై వైసీపీ సభ్యులు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడంపై మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, కింజరాపు అచ్చన్నాయుడు ఘాటుగా ప్రతిస్పందించారు. 2020లోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) నివేదిక స్పష్టంగా వచ్చినప్పటికీ అప్పటి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఐదేళ్ల పాటు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని, బడ్జెట్‌లో తగిన కేటాయింపులు చేయలేదని వైసీపీపై విమర్శలు గుప్పించారు.

“చంద్రబాబు సమర్థతకు నిదర్శనం”

హంద్రీనీవా ప్రాజెక్ట్ పూర్తి చేసి తక్కువ సమయంలోనే 44 టీఎంసీల నీటిని రాయలసీమకు తరలించామని పేర్కొన్నారు. ప్రస్తుతం రాయలసీమ ప్రాజెక్టులు, చెరువుల్లో 366 టీఎంసీల నీరు నిల్వలో ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాయలసీమ సాగునీటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే వేల కోట్లు ఖర్చు చేశామని, తాజా బడ్జెట్‌లో మరిన్ని నిధులు కేటాయించామని తెలిపారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.వైసీపీ పాలనలో నిలిచిపోయిన పనులను ప్రస్తుతం తమపై మోపే ప్రయత్నాలు చేయొద్దని మంత్రులు హితవుపలికారు. రాయలసీమ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్