బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ శాఖలో త్వరలో ఖాళీల భర్తీ – మండలిలో మంత్రి గొట్టిపాటి

విద్యుత్ శాఖలో త్వరలో ఖాళీల భర్తీ – మండలిలో మంత్రి గొట్టిపాటి
  • సీఎం అనుమతితో త్వరలోనే నియామక ప్రక్రియ ప్రారంభం.
  • రూ.8 వేల కోట్లతో ఆర్డీఎసెస్ పనులు వేగవంతం.
  • 5,580 వార్డు ఎనర్జీ అసిస్టెంట్లకు శిక్షణ.
  • విశాఖలో అండర్‌గ్రౌండ్ కేబులింగ్ ఏర్పాటు.

అమరావతి,ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక): విద్యుత్ శాఖలో సిబ్బంది కొరతను తీర్చేందుకు ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అనుమతితో త్వరలోనే నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ వెల్లడించారు.

శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం సిబ్బంది అవసరం ఉందన్నారు. ప్రస్తుతం అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానంలో 18 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5,580 స్వర్ణ వార్డు కార్యాలయ ఎనర్జీ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చి వారి సేవలను వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వీరు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే 77 శాతం ఖాళీలు భర్తీ అయ్యే అవకాశం ఉందన్నారు. ఏఈలు, లైన్‌మెన్ నియామకాలపై కూడా సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

వినియోగదారులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా లక్ష్యంగా రూ.8 వేల కోట్లతో ఆర్డీఎసెస్ పనులు చేపట్టామని తెలిపారు. ఇప్పటికే 75 శాతం పనులు పూర్తయ్యాయని, వచ్చే ఏప్రిల్ నాటికి శాతం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.తుపానులకు గురయ్యే Visakhapatnam నగరంలో అండర్‌గ్రౌండ్ విద్యుత్ కేబులింగ్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. విపత్తుల సమయంలో రాష్ట్రంలోని విద్యుత్ సిబ్బంది సమన్వయంతో 24 గంటల్లోనే పునరుద్ధరణ చేపడుతున్నారని వివరించారు.