Breaking News

ఏ పి కేబుల్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించండి: ఏపీ కేబుల్ ఆపరేటర్ల జేఏసీ విజ్ఞప్తి

విజయవాడ సెంట్రల్, ఫిబ్రవరి 28 నేటి తెలు గు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్కువ ధరకే ఇంటర్నెట్, టెలివిజన్ సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఏపీ ఫైబర్ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్) ప్రస్తుతం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని ఏపీ కేబుల్ ఆపరేటర్ల జేఏసీ (ఏపీసిఓ జేఏసీ) ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సమస్యలను పరిష్కరించి, తమ జీవనోపాధిని కాపాడాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి, నారా లోకేష్‌, లకు జేఏసీ ప్రతినిధులు ఒక లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా విజయవాడ గాంధీ నగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జేఏసి అధ్యక్షులు మాట్లాడుతూ సాంకేతిక సమస్యలు నిర్వహణలోపాలు ఏపీ ఫైబర్ ఛానళ్ల సిగ్నల్ నాణ్యత సరిగా లేకపోవడం, నెట్‌వర్క్ వేగం ఆశించిన స్థాయిలోలేకపోవడం వల్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జేఏసీ పేర్కొంది. నెట్‌వర్క్ నిర్వ హణలో లోపాలు, సరైన బిల్లింగ్, మానిటరింగ్ సిస్టమ్ లేకపోవడం ప్రధాన సమస్యలుగా మారాయని వివరించారు. ముఖ్యంగా ఫైబర్ కట్ అయినప్పుడు మరమ్మతులు చేయడా నికి రోజుల తరబడి సమయంపడుతుండటంతో కస్టమర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారని, అలాగే కొత్త బాక్సుల కొరత వల్ల కొత్త కనెక్షన్లు ఇవ్వడం సాధ్యపడటం లేదని వారు తెలిపారు. ప్రమాదంలో వేలాది కుటుంబాలు ఒకప్పుడు తక్కువ కాలంలోనే 12 లక్షల కనెక్షన్లు పొందిన ఏపీ ఫైబర్, ప్రస్తుతం సరై న నిర్వహణ లేకపోవడం వల్ల వినియోగదారులను కోల్పోతోందని, వారు ప్రైవేట్ సంస్థల వైపు మళ్లుతున్నారని జేఏసీ ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల ఈ వృత్తిపై ఆధారపడిన వేలాది మంది కేబుల్ ఆపరేటర్లు, వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని వివరించారు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఏపీ ఫైబర్ నెట్‌వ ర్క్‌ను ఆధునీకరించి, ప్రతి ఇంటికీ నాణ్యమైన సేవ లు అందేలా చూడాలని జేఏసీ రాష్ట్ర చైర్మన్ మిరియాల శ్రీరామ్, ఇతర జిల్లా ప్రతినిధులు కోరారు ఈ కార్యక్రమం లో పలువురు కేబుల్ ఆపరేటర్లు పాల్గొని తమ మద్దతు తెలిపారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *